• తాజా వార్తలు

అమెజాన్ నుండి అస్స‌లు కొన‌కూడ‌ని 10 వ‌స్తువులేంటో తెలుసా?

అమెజాన్‌.. ఈకామ‌ర్స్‌లో ప్ర‌పంచ దిగ్గ‌జం. అమెజాన్‌లో కొంటే ఆ ప్రొడ‌క్ట్ ఒరిజిన‌ల్ అని క‌స్ట‌మ‌ర్లంద‌రూ న‌మ్ముతారు. దానికి త‌గ్గ‌ట్లే అమెజాన్‌లో కొన్న వ‌స్తువులు ఒరిజిన‌ల్‌గానే ఉంటాయి. అయితే అలాంటి మంచి సైట్‌లో కూడా కొన్ని చెత్త ప్రొడ‌క్ట్స్ ఈమ‌ధ్య క‌నిపిస్తున్నాయి. అలాంటి వాటిలో మ‌న‌కు త‌ర‌చూ క‌నిపించే 10  లోక్వాలిటీ ప్రొడ‌క్ట్స్ లిస్ట్ ఇదీ. వీటిని అస్స‌లు కొన‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం అంటున్నారు ఈకామ‌ర్స్ నిపుణులు. 

1.ప్యాడ్రియాగ్ వైర్‌లెస్ ఎల్ఈడీ బ్లూటూత్ స్పీక‌ర్‌
రంగు రంగుల్లో ఆకర్షించే ఈ బ్లూ టూత్ స్పీక‌ర్  ఓవేస్ట్ ప్రొడ‌క్ట్‌.  600 రూపాయ‌ల విలువైన ప్రొడ‌క్ట్‌ను డిస్కౌంట్ మీద 170ల‌కే అమ్ముతున్నామని, డెలివరీ చార్జిలు 75 రూపాయ‌ల‌ని సైట్‌లో ఉంది. అంటే మొత్తంగా 250 రూపాయ‌లు. దీని క్వాలిటీచేత్తో ప‌ట్టుకుంటే చాలు తెలిసిపోతుంది. దీన్ని కొంటే 250 రూపాయ‌లు వేస్ట‌యినట్టే.

2. రాయ‌ల్ లైట్ 12.వాట్స్  పోర్ట‌బుల్ ఫ్లెక్సిబుల్ యూఎస్‌బీ ఎల్ఈడీ లైట్ ల్యాంప్‌
219 రూపాయ‌ల ధ‌ర చూపించే ఈ ప్రొడ‌క్ట్ యూఎస్‌బీగానూ, ఎల్ఈడీ లైట్‌గానూ వాడుకోవ‌చ్చు అని చూపిస్తారు. ఇది కూడా చెత్త క్వాలిటీ

3. బాండ్ ఫ‌ర్ మొబైల్ 90 రూపాయ‌లు, 76 రూపాయ‌ల డెలివరీ ఛార్జి

4. ఎం స్టిక్ మైక్రో యూఎస్‌బీ టూ  8 పిన్ యాపిల్ లైట్నింగ్ చార్జ‌ర్ అడాప్ట‌ర్ క‌న్వెర్ట‌ర్ ఫ‌ర్ ఐఫోన్‌
ఛార్జ‌ర్ అడాప్ట‌ర్ క‌న్వెర్ట‌ర్‌గా చూపించే ఈ ప్రొడ‌క్ట్‌లో ఒక‌వైపు యూఎస్‌బీ క‌నెక్ట‌ర్‌, మ‌రోవైపు లైట్నింగ్ ఛార్జ‌ర్ అడాప్ట‌ర్ ఉన్నాయి. యాపిల్ ఫోన్‌‌కు ప‌నికొస్తుంద‌ని చూపిస్తారు. ధ‌ర 99 రూపాయ‌లు, డెలివరీ ఛార్జీలు 55 రూపాయ‌లు. ఇది కూడా లోక్వాలిటీ ప్రొడ‌క్ట్‌.
 

5. జోష్‌పిల్ పోర్ట‌బుల్ వైర్‌లెస్ పోర్ట‌బుల్ బ్లూటూత్ స్పీక‌ర్‌
ఇది అన్ని ఫోన్ల‌కు ప‌నికొస్తుందని, బ్లూటూత్ స్పీక‌ర్‌గా,  హ్యాండ్స్ ఫ్రీ డివైస్‌లా వాడుకోవ‌చ్చ‌ని చూపిస్తారు. 1499 రూపాయ‌ల‌ది 599 రూపాయ‌ల‌కే ఇస్తున్న‌ట్లు, 50 రూపాయ‌లు డెలివరీ ఛార్జి అని సైట్లో ఉంది. దీనిలో సౌండ్ క్వాలిటీ ప‌ర‌మ‌నాసిర‌కంగా ఉంటుంది. రెండు నెల‌లు కూడా రాకుండానే పాడైపోతుంది కూడా.

6. ట్రూప్స్ అల్ట్రా థిన్ పోర్ట‌బుల్ 10,400 ఎంఏహెచ్ ప‌వ‌ర్ బ్యాంక్‌
దాదాపు 900 డిస్కౌంట్ పోను 548 రూపాయ‌ల‌కు అమ్మే ఈ ప‌వ‌ర్ బ్యాంక్ నాసిరకంది. బ్యాట‌రీలో ఛార్జింగ్ ఎక్క‌దు. మ‌రో రెండు వంద‌లు పెడితే ఎంఐలాంటి బ్రాండెడ్ ప‌వ‌ర్‌బ్యాంక్ దొరుకుతుంది. 

7. ఫిలిప్స్ పోర్టబుల్ వైర్‌లెస్ స్పీక‌ర్‌
ఇది ఒరిజిన‌ల్ ఫిలిప్స్ ప్రొడ‌క్టే. ధ‌ర కూడా డిస్కౌంట్ పోను 1300 వ‌ర‌కు ఉంది. కానీ ఆ ధ‌ర‌కు త‌గ్గ న్యాయం చేయ‌లేదు.
 

8.లాంబెంట్ హార్ట్‌రేట్ మానిట‌ర్ బ్లూటూత్‌హెల్త్ ఫిట్‌నెస్ ట్రాక‌ర్ 
 ఏడాది వారంటీతో దాదాపు 1295 రూపాయ‌ల‌కువ‌చ్చే ఇది కూడా నాసిర‌కం స‌రుకే.


9 యాప్ కేస్ వైర్‌లెస్ ఎయిర్‌పాడ్ 
ఇది యాపిల్ కోసం తీసుకొచ్చిన ప్రొడ‌క్ట్‌. ఒరిజిన‌ల్ ప్రొడ‌క్ట్ 11, 12వేలు ఉంటుంది. ఈ ప్రొడ‌క్ట్ 1000 రూపాయ‌ల ధ‌ర‌కే ఇచ్చినా ఎందుకూ ప‌నికిరాద‌ని చెప్పాలి.

10. మేక్ సెల్ బ్లూటూత్ వాచ్ విత్ సిమ్‌కార్డ్ క‌నెక్టివిటీ
ఇది యాపిల్ వాచ్‌కు డూప్లికేట్‌. దీన్ని కొంటే 1500 రూపాయ‌లు నీళ్ల‌లో పోసిన‌ట్లే. పైన చెప్పిన లిస్ట్ అంతా అమెజాన్లో క‌నిపించే ప‌ర‌మ నాసిర‌కం ప్రొడక్ట్స్‌. కాబ‌ట్టి ప్రొడ‌క్ట్ డిస్క్రిప్ష‌న్‌, డిస్కౌంట్స్ చూసి టెంప్ట‌వ‌కండి.

జన రంజకమైన వార్తలు