• తాజా వార్తలు

అమెజాన్ లో ధరల తగ్గుదలను ట్రాక్ చేయడంతో పాటు కూపన్లను ఆటోమేటిగ్గా అప్లయ్ చేసే ప్లగ్ ఇన్

ఆన్ లైన్ షాపింగ్ వచ్చాక ఆఫర్లూ ఎక్కువయ్యాయి. కూపన్లు.. వాటికి కోడ్ లు.. అవి అప్లయ్ చేయడం.. ఎంతోకొంత ప్రయోజనం పొందడం చాలామంది చేస్తున్నదే. కానీ... ఆ కూపన్లు ఏమున్నాయో తెలుసుకోవడం.. వాటి కాలపరిమితి ఉందో లేదో తెలుసుకోవడం.. ఎలా అప్లయ్ చేయాలో తెలుసుకోవడం విషయంలో చాలామందికి అవగాహన తక్కువ. దాంతో.. కూపన్లు, ఆఫర్లు అందుబాటులో ఉన్నా వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. అయితే... సూటబుల్ కూపన్లు వాటికదే సెలక్ట్ చేసుకుని, అప్లయ్ అయ్యే వీలుంటే.. బాగుంటుంది కదా. అచ్చంగా అలాంటిదే ఓ ప్లగ్ ఇన్ ఉంది. అయితే... ఇది ఒక్క అమెజాన్ కు మాత్రమే పనిచేస్తుంది. ఇది కూపన్లను ఆటోమేటిగ్గా అప్లయ్ చేయడమే కాదు, ఆయా వస్తువుల ధరలను కూడా ట్రాక్ చేస్తుంది. హానీ అనే ఈ బ్రౌజర్ ఎక్సటెన్షన్ క్రోమ్ 9.9.4 ఆ పైన వెర్షన్లలో పనిచేస్తుంది. దీంతో పాటు ఫైర్ ఫాక్స్, సఫారీ, ఒపెరా బ్రౌజర్లకూ పనిచేస్తుంది. అమెజాన్లో ఏ వస్తువుకైనా... ఈ ప్లగ్ ఇన్ లోడ్ చేసుకుంటే అమెజాన్ లో షాపింగ్ చేసేటప్పుడు ఏ వస్తువు ఉన్న పేజ్ లోనైనా ప్రోడక్ట్ పేరు కింద హానీ ఐకాన్ కనిపిస్తుంది. ప్రోడక్ట్ ను డ్రాప్ లిస్టుకు యాడ్ చేయాలా అని అది అడుగుతుంది. ఓకే చేస్తే అది అప్పటి నుంచి కొంత కాలం పాటు ఆ వస్తువు ధరను ట్రాక్ చేయడం మొదలుపెడుతుంది. ధర బాగా తగ్గినప్పుడు మనకు అలర్డ్ పంపుతుంది. డీఫాల్ట్ ట్రాకింగ్ పీరియడ్ 30 రోజులు. హానీ వెబ్ సైట్ ద్వారా రిజిష్టర్ అయిన యూజర్లకైతే ఇది కొన్ని రకాల వస్తువులు, కొందరు రిటైలర్లకు సంబంధించిన వస్తువులకు కూపన్లను సజెస్ట్ చేస్తుంది. ఇది చాలా ఉపయోగకరం.

జన రంజకమైన వార్తలు