• తాజా వార్తలు

అమెజాన్ బేసిక్స్ ప్రొడెక్ట్ త‌క్కువ ధ‌ర‌కే ఎందుకు ల‌భిస్తాయో తెలుసా?

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలంటే మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగించే సైట్ అమేజాన్‌. ముఖ్యంగా ఆఫ‌ర్ల సమయంలో ఈ సైట్ హ్యాంగ్ అయిపోతుందా అనిపించేంత‌గా! అంత‌గా అన్ని వ‌స్తువులు అందుబాటులో ఉండే ఈ సైట్‌లో మ‌నం ఏ చిన్న వ‌స్తువు కావాల‌న్నా వెంట‌నే సెర్చ్ చేస్తాం. ఉదాహ‌ర‌ణ‌కు అమేజాన్ సైట్లో బ్యాట‌రీల కోసం సెర్చ్ చేస్తే  మ‌న‌కు వంద‌ల సంఖ్య‌లో ప్రొడెక్ట్స్ జాబితా వ‌స్తుంది. అయితే వీటిలో తొలి ప‌ది ప్రొడెక్ట్స్ దాదాపు ఒకే కంపెనీకి చెందిన‌వి ఉంటాయి. ఐఫోన్ కేబుల్స్ గురించి సెర్చ్ చేస్తే టాప్ లిస్టింగ్‌లో అన్ని ఒకే కంపెనీకి సంబంధించిన ప్రొడొక్ట్స్ ఉంటాయి. అంతేకాదు వీటిలో చాలా వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి. 

ఇలా అమేజాన్‌లో త‌క్కువ ధ‌ర‌కే మ‌న‌క వ‌స్తువులు క‌న‌బ‌డ‌టానికి కార‌ణం అమేజాన్ బేసిక్స్‌. అమేజాన్‌లో షాపింగ్ చేస్తున్నాఅమేజాన్ బేసిక్స్‌తో క‌నెక్ట్ అయి ఉంటాయి. ఓవ‌రాల్‌గా బెస్ట్ సెల్లింగ్ ప్రొడెక్ట్‌ను ఇది లిస్ట్ ఔట్ చేస్తుంది.  అంతేకాదు ఆఫ‌ర్ల‌ను కూడా మ‌నకు చూపిస్తుంది. అంటే ఇలాంటి త‌క్కువ ధ‌ర‌కు వ‌చ్చే వ‌స్తువుల‌న్నీ ఒకే చోట‌కు చేర్చ‌డ‌మే ఈ అమేజాన్ బేసిక్స్ ప‌ని. 1500 పైగా వ‌స్తువులు అమేజాన్ బేసిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి. 


దీనిలో మైక్రో పైబ‌ర్ గ్లాసులు, బ్యాట‌రీలు, బ‌ట్ట‌లు లాంటివి ఈ బేసిక్స్‌లో ఉంటాయి. అమేజాన్ బేసిక్స్ ద్వారా సాధార‌ణ ధ‌ర‌ల కంటే 30 శాతం త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తువులు అమ్మ‌కానికి ఉంటాయి. ఈ వ‌స్తువుల‌కు క‌నీసం 4 స్టార్ రేటింగ్ ఉండ‌డం మ‌రో ప్ర‌త్యేక‌త‌. అంటే త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తున్నాయి కదా అని ఇవేమీ నాణ్య‌త లేనివి కాదు.. ఉన్న‌వాటిలో బెస్ట్ అనే చెప్పాలి.  అమేజాన్ బేసిక్స్ ద్వారా ఇప్ప‌టికే 270 మిలియన్ల వస్తువులు అమ్ముడుపోయాయంట‌నే దీని గిరాకీ ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.
 

జన రంజకమైన వార్తలు