• తాజా వార్తలు

అమెజాన్‌లో ఎప్పుడు బుక్ చేసినా ఒక్క రోజులోనే డెలివరీ

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ వినియోగదారుల కోసం సింగిల్ డే డెలివరీ అంటూ దూసుకువచ్చింది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్ల కోసం అన్ని డెలివరీలను ఒకరోజు సెట్ చేసుకునే విధంగా సరికొత్త ఆలోచనను తెరమీదకు తెస్తోంది. వారంలో మీరు ఎన్ని ఉత్పత్తులైనా కొనుగోలు చేయవచ్చు. వీటన్నింటిని వారంలో మీరు సెలక్ట్ చేసుకునే రోజున మీ ఇంటికి తీసుకువచ్చి నేరుగా డెలివరీ చేస్తారు. తద్వారా వినియోగదారులకు ఉత్పత్తి లేట్ అయిందన్న టెన్సన్ ఉండదు.

ఇకపై కొనుగోలుదారులు అమెజాన్ లో ఏదైనా ఉత్పత్తులను కొనుగోలు చేస్తే అవి ఓ రోజున ఇంటికి చేరుతాయి. ఉదాహరణకు మీరు శనివారం డెలివరీ  పెట్టుకుంటే మిగతా అన్ని రోజులు మీరు ఏం షాపింగ్ చేసినా అవన్నీ ఆ రోజు మీ ఇంటికి వచ్చి చేరుతాయి. మొత్తం గ్రూపు ప్యాకేజీలను ఆ రోజే మీ ఇంటికి ట్రక్ ద్వారా అమెజాన్ చేరుస్తుంది.

అయితే కొనుగోలు దారులు ఒక వేళ ఉత్పత్తులను వద్దనుకుంటే వాటిని తీసివేసుకోవచ్చు. రెండు రోజుల ముందు వస్తువులు తీసివేయడం కాని అలాగే యాడ్ చేయడం కాని చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవారికి మాత్రమే. ఇప్పటికే ఈ పక్రియ ప్రారంభమైందని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని అమెజాన్ డెలివర వైస్ ప్రెసిడెంట్ Maria Renz తెలిపారు.

కాగా కంపెనీ 2030 నాటికి దాదాపు 50 శాతం net-zero carbon ద్వారా షిప్ మెంట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. కంపెనీ ఈ మధ్యనే దాదాపు 700 మిల్లియన్ డాలర్లు రివియాన్ కంపెనీలో పెట్టుబడులుగా పెట్టింది. ఇందులో భాగంగా electric pickup truckలను 2020 నాటికి అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది. 

జన రంజకమైన వార్తలు