• తాజా వార్తలు

శ్రీవారి భక్తులకు ఉబర్ సేవలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి వెళ్లని వాళ్ళు ఉండరు. చాలా మంది ఏడాదికోసారి అయినా వెంకన్న దర్శనానికి వెళుతుంటారు . అయితే తిరుపతికి వచ్ఛే  లక్షల మంది యాత్రికుల కోసం ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ క్యాబ్ సర్వీస్ ప్రారంభించింది.  ఉబర్ ప్రీమియం, ఉబర్ రెంటల్స్ తో పాటు ఉబెర్ ఆటో సర్వీస్ కూడా తిరుపతిలో అందుబాటులోకి తీసుకొస్తోంది.    

ప్రీమియం లో ఖరీదయిన కార్లు అందుబాటులో ఉంటాయి.
 ఇక ఉబర్ రెంటల్స్ లో గంటల లెక్కన అద్దె చెల్లించి క్యాబ్ బుక్  చేసుకోవచ్చు. 

ఏపీలో మూడవ నగరం
తిరుపతిలో సర్వీస్ ప్రారంభించనుండటం  సంతోషంగా ఉందని, దీంతో ఇండియాలో 90 నగరాల్లో ఉబర్ సర్వీసులు ప్రారంభించినట్లు అయిందని ఉబర్ ప్రకటించింది. ఇక ఏపీలో విజయవాడ, వైజాగ్ తర్వాత ఉబర్ సర్వీసులు అందుబాటులోకి రానున్న మూడో నగరం తిరుపతి.

జన రంజకమైన వార్తలు