* ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీమినిస్టర్ లోకేష్‌తో యాపిల్ టీం భేటీ
* టెంపుల్ సిటీలో యాపిల్ ఏర్పాటుపై డిస్కషన్స్
ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పాలని నిర్ణయించుకున్న టెక్నాలజీ జెయింట్ యాపిల్ .. దాన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలో మాత్రం ఇంకా తేల్చుకోలేకపోతుంది. ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, జీఎస్టీ నుంచి మినహాయింపు వంటి వాటి కోసం ఇప్పటికే రెండు మూడు సార్లు యాపిల్ రిప్రంజెంటేటివ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్‌తో సమావేశమయ్యారు. త్వరలో సెంట్రల్ ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్‌ను కూడా కలవబోతున్నారు. యాపిల్ లాంటి ఇంటర్నేషనల్ రిపుటేషన్ ఉన్న కంపెనీ ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పితే మేకిన్ ఇండియా ఇనీషియేటివ్‌కు మంచి స్ట్రెంగ్త్ అవుతుందన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని ఎగ్జెంప్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఎక్కడంట.. ఎక్కడంట?
అయితే ఈ యూనిట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న ఇష్యూపై యాపిల్ ఇంకా క్లారిటీకి రాలేదు. బెంగళూరులో అని కొన్నాళ్లు చెప్పారు. తర్వాత హైదరాబాద్ అన్నారు.. ఇప్పుడు తిరుపతి పేరు కొత్తగా వచ్చింది. శుక్రవారం యూఎస్‌లోని యాపిల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ముగ్గురు సీనియర్ అఫీషియల్స్ విజయవాడ వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ మినిస్టర్ లోకేష్‌లతో సమావేశమయ్యారు. తిరుపతి సమీపంలో యాపిల్ హార్డ్‌వేర్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని ఇంటరెస్ట్ చూపిస్తోంది. దీనిపై సీఎం, మినిస్టర్‌లతో యాపిల్ ఏం మాట్లాడింది అనేదానిపై క్లారిటీ రాలేదు.
లక్షల్లో జాబ్‌లు
సాఫ్ట్‌వేర్, ఐఫోన్, కంప్యూటర్లు తదితర రంగాల్లో హార్డ్‌వేర్ పార్కు ఏర్పాటు చేయాలన్నది యాపిల్ ప్లాన్. ఆ పార్క్ ఏ రాష్ట్రంలో వస్తే ఆ స్టేట్‌కు 3, 4 లక్షల జాబ్‌లు వస్తాయి. ఇండస్ట్రియల్ సెక్టార్‌లో మంచి గుర్తింపు వస్తుంది. ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ఆ స్టేట్‌లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా భావిస్తాయి. అందుకే యాపిల్ లాంటి ఇంటర్నేషనల్ ఫేమస్ కంపెనీని ఆకర్షించడానికి కర్ణాటక, తెలంగాణ, ఇప్పడు లేటెస్ట్‌గా ఏపీ పోటీపడుతున్నాయి. కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో యాపిల్ లాంటి సంస్థను తీసుకురాగలిగితే ఇండస్ట్రియల్‌గా బూస్టప్ అవుతుందన్నది ఏపీ గవర్నమెంట్ ఆలోచన. ఆ దిశగా తన ప్రయత్నాలను ఏపీ స్పీడప్ చేస్తోంది.