• తాజా వార్తలు

ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగానికి అప్లై చేయడం ఎలా ?

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ అయింది. షెడ్యూల్ ప్రకారం జూలై 22న విడుదల కావాల్సిన నోటిఫికేషన్ జూలై 26న రాత్రి విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం 1,28,728 పోస్టులను భర్తీ చేస్తుంది. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 99,088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులు భర్తీ చేస్తారు. జిల్లా ఎంపిక కమిటీల ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. gramasachivalayam.ap.gov.in. వెబ్ సైట్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ ఆగస్ట్ 10.

పోస్టుల వివరాలు 
Panchayat Secretary - 7040, Village Revenue Officer(VRO)(Grade-II) - 2,880, ANMs (Grade-III) - 13,540, Animal Husbandry Assistant - 9,886, Village Fisheries Assistant - 794, Village Horticulture Assistant - 4,000, Village Agriculture Assistant (Grade-II) - 6,714, Village Sericulture Assistant - 400, Mahila Police and Women & Child Welfare Assistant - 14,944, Engineering Assistant (Grade-II) -11,158, Panchayat Secretary (Grade-VI) Digital Assistant - 11,158, Village Surveyor (Grade-III) - 11,158, Welfare and Education Assistant - 11,158.

భర్తీ ఎలా ? 
గ్రామ, వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులను స్థానికులకు కేటాయిస్తారు. మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. నాలుగో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ళ కాలంలో నాలుగేళ్ల పాటు ఏ జిల్లాలలో చదువుకుంటారో సదరు అభ్యర్థిని ఆ జిల్లా స్థానిక కేటగిరీ కింద గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన పోస్టుల్లో 80 శాతం వారితో భర్తీ చేస్తారు. ఓ జిల్లాలో ఎక్కువ కాలం చదివి వేరే జిల్లాలో దరఖాస్తు చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో అంటే 20 శాతం మందిలో ఎంపిక చేస్తారు.

అర్హతలు ఏంటీ ?
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారి వయస్సు 18 నుంచి 42 మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట పరిమితిలో అయిదేళ్లు సడలింపు. వికలాంగులకు పదేళ్లు సడలింపు. సంబంధిత ఉద్యోగంలో ఇప్పటికే ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తూ ఉంటే వయో పరిమితిలో వారి సర్వీసు కాలానికి సడలింపు ఉంటుంది. వీరికి డీడీవో ( డిస్ట్రిక్ట్ డెవలప్‍‌మెంట్ ఆఫీసర్ ) గా పంచాయతీ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఈ పంచాయతీ సెక్రటర్లకే.. గ్రామవాలంటీర్లకు వేతనాలు చెల్లించే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది.

వేతనాలు ఎంత ?
ఎంపికయ్యే అభ్యర్థికి మొదటి రెండేళ్లు రూ.15వేల చొప్పున గౌరవ వేతనం ఉంటుంది. ఈ రెండేళ్లు ప్రొబెషనరీ పీరియడ్. అనంతరం పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగా హోదా కల్పిస్తారు. అప్పుడు బేసిక్ శాలరీని అమలు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు రూ.15,000 నుంచి రూ.46,000 మధ్య బేసిక్ శాలరీ ఉంది. మిగిలిన పోస్టులకు రూ.14,600 నుంచి రూ.44,870 మధ్య బేసిక్ శాలరీగా అమలు చేస్తారు.

దరఖాస్తు విధానం ఎలా? 
 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకు ప్రభుత్వం మూడు వెబ్ పోర్టల్స్‌ను ఏర్పాటు చేసింది. http://gramasachivalayam.ap.gov.in/ ఈ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే తొలుత ఉద్యోగ ప్రకటన వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3లలో దరఖాస్తు విధానం ఉంటుంది.

స్టెప్ 1
వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఇందులో దరఖాస్తుదారు పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ లేకుంటే దాని టిక్ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఓటరు కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, పాస్ బుక్, పాస్ పోర్ట్ వంటి ఇతర వివరాలు నింపవలసి ఉంటుంది. ఆ తర్వాత ఫోటోను అటాచ్ చేయాలి. ఏ సైజ్ ఫోటో ఉండాలో కూడా అక్కడ క్లియర్‌గా ఉంది. ఆ తర్వాత డిక్లరేషన్‌పైన టిక్ చేసి, కాప్చా ఎంటర్ చేసి, అప్ లోడ్ చేయాలి. అప్పుడు దరఖాస్తుదాకు సంబంధించి కేటాయించిన ఐడీ వివరాల మెసేజ్ వస్తుంది. దీని ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
స్టెప్ 2
వివిధ 3కేటగిరీల కింద ఉద్యోగ వివరాలు ఉంటాయి. మీరు అందులో ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడీ ఇవ్వాలి. డేటా ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కాప్చాను ఎంటర్ చేయాలి. డిక్లరేషన్ పైన టిక్ చేసి, సబ్‌మిట్ చేయాలి. తప్పులు లేకుండా నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం పూర్తి చేసి, క్లిక్ బటన్ నొక్కే వరకు తప్పులు సరిదిద్దుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం మార్చుకునే వీలుండదు.
స్టెప్ 3
చివరలో పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడీ.. లాగిన్ ఐడీ ఎంటర్ చేయాలి. పుట్టిన తేదీ వివరాలు ఇవ్వాలి. కాప్చాను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేయాలి.

ఫీజు వివరాలు
అప్లికేషన్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.200. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లు కేవలం అప్లికేషన్ ఫీజు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. నాన్ లోకల్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. దీనికి రూ.100 ఛార్జ్ చేస్తారు. గరిష్టంగా ఒక అప్లికేషన్ 3 జిల్లాలకు అనుమతి.


 

జన రంజకమైన వార్తలు