డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా...సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతిపౌరుడికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం...ఇప్పటికే కొన్ని యాప్స్ ను రూపొందించింది. గతేడాది ప్రారంభించిన సివిజిల్ యాప్ ను పాన్ ఇండియాలో భాగంగా అమలులోకి తీసుకువచ్చింది. ఓటింగ్ ప్రక్రియ యొక్క ప్రవర్తనా నియమావళిని పరిశీలించడం కోసం సివిజిల్ యాప్ ను లాంచ్ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి, అనేక రకాల చట్టవిరుద్దమైన కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటారు చాలామంది నాయకులు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంపిణీ చేయడం దగ్గర్నుంచి... దొంగచాటుగా మద్యం, ఇతర వస్తువులనుపంపిణీ చేస్తుంటారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సివిజిల్ యాప్ ను అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 11నుంచి మే 19 వరకు జరగనున్న లోక సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లయితే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
సివిజిల్ యాప్ గురించి....
భారత ప్రభుత్వం....mcv(మోడల్ కోడ్ ఆఫ్ ప్రవర్తనా) ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయడానికి లేదా ట్రాక్ చేయడానికి ఉపయోగించే విధంగా సివిజిల్ అప్లికేషన్ను రూపొందించింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారి వివరాలు ఆలస్యంగా తెలియడం, నేరస్థుల ప్రవర్తనా నియమాళిని అమలు చేయకపోవడం...ఎన్నికల కమిషన్ నుంచి తప్పించుకోవడం ఇవన్నీ సమస్యగా మారాయి. అక్రమాలకు పాల్పడుతున్నవారికి సంబంధించిన వీడియోలు కానీ, ఫోటోలు కానీ లేకపోవడం ఎన్నికల కమిషన్ పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి...చట్టవిరుద్దమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నవారి వివరాలను ఈ సివిజిల్ యాప్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఓటరును ప్రలోభ పెట్టే కొన్ని విషయాలు....
1. డబ్బు, మద్యపానం, డ్రగ్స్ పంపిణీ
2. తుపాకీతో బెదిరింపులకు దిగడం
3. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం
4. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు
5. బెదిరింపులు
సివిజిల్ యాప్ ఎలా పనిచేయనుంది?
ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు జరిగినా...సామాజిక బాధ్యత కలిగిన ప్రతిపౌరుడు ఎన్నికల సంఘం ద్రుష్టికి తీసుకెళ్లేలా సివిజిల్ యాప్ తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్. చట్టవ్యతిరేకంగా జరిగే మద్యం, డబ్బులు, ఇతర వస్తువుల పంపిణీని అడ్డుకోవడంతోపాటు...ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో భాగం కావచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించేవారందరూ సివిజిల్ యాప్ వాడుకునే అవకాశం ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి సమాచారం అందించినట్లయితే.... కొద్దిసేపట్లోనే ఘటనా స్థలానికి చేరుకుంటారు. వీడియోలు, ఫోటోలతో పంపిన మెసేజ్ లు GPSద్వారా ఎన్నికల సంఘానికి అందుతుంది. దాని ఆధారంగా సంబంధిత జిల్లా యంత్రాంగానికి సమాచారం అందుతుంది. సమాచారం అందిన తర్వాత వీలైనంత త్వరగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్. అయితే సమాచారం పంపించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతుంది ఈసి.