• తాజా వార్తలు

ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ సోర్స్ కోడ్ రిలీజ్‌.. ఇక యాప్ డిటైల్స్ అంద‌రికీ అందుబాటులో.. 

కరోనా వైరస్ ట్రాకింగ్ కోసం నేషనల్ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్‌తో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్ తయారుచేయించింది. లాక్ లాక్‌డౌన్ కాలంలో ఉద్యోగులు, ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ను ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేయాలని ఆదేశించింది. అయితే ఈ యాప్ ద్వారా వినియోగదారుల డేటాను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది అని పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వీటికి జవాబు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆండ్రాయిడ్ ఫోన్ల ఆరోగ్య‌సేతు యాప్ సోర్స్ కోడ్‌ను రిలీజ్ చేసింది.దీంతో డెవ‌ల‌ప‌ర్స్ యాప్ డిటెయిల్స్ తెలుసుకోవ‌చ్చు. 

ఆండ్రాయిడ్ యూజ‌ర్లే 98% 
ఆరోగ్య‌సేత‌ యాప్ యూజ్ చేసేవారిలో 98% మంది ఆండ్రాయిడ్ వినియోగదారులే. అందుకే ముందుగా ఆండ్రాయిడ్ యాప్  సోర్స్ కోడ్ రిలీజ్ చేసామని ప్రభుత్వం ప్రకటించింది. ఐఓఎస్ యాప్ సోర్స్ కోడ్ కూడా రెండు వారాల్లోనే రిలీజ్ చేస్తామని ప్రకటించింది. అలాగే  సర్వర్  సోర్స్ కోడ్‌ కూడా విడుదల చేస్తామని ప్రకటించింది. 

ఓపెన్‌సోర్స్ కోడ్‌తో ఉపయోగాలు ఏంటి?
 * ఓపెన్ సోర్స్ కోడ్ ద్వారా యాప్ డెవలపర్స్ ఆరోగ్యసేతు యాప్ ఎలాంటి డేటా సేక‌రిస్తోంది?
 * ఆ డేటాను క్కడ  స్టోర్ చేస్తుంది  వంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. 
* అవ‌స‌ర‌మైన మార్పులు కూడా సూచించ‌వ‌చ్చు. 

ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు సంబంధించిన ఆరోగ్య‌సేతు యాప్ ఓపెన్ సోర్స్ కోడ్ కావాలంటే  https://github.com/nic-delhi/AarogyaSetu_Android.git అనే లింక్‌ను క్లిక్ చేయాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

జన రంజకమైన వార్తలు