• తాజా వార్తలు

మ‌నం చేతులు కడుక్కోవడాన్ని ల‌య‌బ‌ద్ధం చేసిన గూగుల్ అసిస్టెంట్ 

కొవిడ్‌-19 (క‌రోనా) వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌న్న భ‌యంతో ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన ప్ర‌ధాన‌మైన మార్పేంటో గ‌మ‌నించారా? త‌ర‌చూ చేతులు క‌డుక్కోవ‌డం, శానిటైజ‌ర్‌తో శుభ్ర‌పరుచుకోవడం.  ఫారిన్ కంట్రీస్‌లో ఈ హ్యాండ్ వాష్ చాలా సాధార‌ణంగా చేసుకుంటారు. కానీ మ‌న ఇండియ‌న్ క‌ల్చ‌ర్‌లో ఈ హ్యాండ్‌వాష్ అనేది చాలా త‌క్కువ‌నే చెప్పాలి. కంప్యూట‌ర్ ముందు కూర్చుని చిప్స్ తినేవాళ్లు, బైకో.. కారో న‌డుపుతూనే స్నాక్స్ చ‌ప్ప‌రించేవాళ్లు మ‌న జ‌నాభాలో క‌నీసం 100 కోట్ల మంది ఉంటారు. అంటే మ‌నం చేతుల శుభ్ర‌త‌కు అంత ప్రాధాన్య‌మివ్వం. వైర‌స్‌లు, బ్యాక్టీరియాలు ఇలాంటి అల‌వాట్ల వ‌ల్లే మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశించి రోగాలు తెచ్చిపెడుతుంటాయి. క‌రోనా పుణ్య‌మా అని జ‌నాలంతా హాండ్‌వ్యాష్ చేసుకుంటున్నారు. అయితే దీన్ని మ‌రింత ప‌క్కాగా చేసేందుకు గూగుల్ త‌న వాయిస్ అసిస్టెంట్‌లో ఓ కొత్త క‌మాండ్‌ను తీసుకొచ్చింది. 

స‌రిగ్గా చేయ‌డం లేద‌ని
వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్‌తో క‌లిసి గూగుల్ ఒక కొత్త వాయిస్ అసిస్టెంట్ క‌మాండ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.  ఇప్పుడు హ్యాండ్‌వాష్ చేస్తున్న‌వాళ్ల‌లో 90% మంది  కూడా నిర్దేశిత స‌మ‌యం వాష్ చేసుకోవ‌డం లేద‌ని అమెరిక‌న్ వైద్య‌వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆండ్రాయిడ్ యూజ‌ర్లంద‌రికీ ఉప‌యోగ‌ప‌డేలా గూగుల్ ఈ కొత్త వాయిస్ క‌మాండ్‌ను తీసుకొచ్చింది. దీంతో ఎంత‌సేపు చేతులు క‌డుక్కోవాలో ఈజీగా గుర్తించేలా ఓ సాంగ్‌ను ఈ వాయిస్ క‌మాండ్‌కు లింక్ చేసింది.

ఇదిగో ఇలా ప‌నిచేస్తుంది
* ఈ వాయిస్ క‌మాండ్‌ను మీ గూగుల్ అసిస్టెంట్ ద్వారా వినాలంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ యాప్‌లోకి వెళ్లండి. 

* Hey Google, help me wash my hands అని వాయిస్ క‌మాండ్ ఇవ్వాలి.  

* అప్పుడు వెంట‌నే మీ గూగుల్ అసిస్టెంట్ Row, Row, Row Your Boat అనే సాంగ్‌ను వినిపిస్తుంది. వాష్ వాష్ వాష్ యువ‌ర్ హ్యండ్స్ అంటూ సాంగ్ మొద‌ల‌వుతుంది.

*  ఈ సాంగ్ 40 సెక‌న్ల‌పాటు వ‌స్తుంది. అది వ‌స్తున్నంత‌సేపు మీరు మీ చేతులు క‌డుక్కోవాలి.  

* వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేషన్ (డ‌బ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్ర‌కారం 40 సెక‌న్ల‌పాటు చేతుల‌ను స‌బ్బుతో రుద్ది క‌డుక్కుంటే క్రిముల‌న్నీ పోతాయి. 

జన రంజకమైన వార్తలు