• తాజా వార్తలు

టిక్ టాక్ కు పోటీగా వచ్చిన మిట్రాన్ యాప్ వాడుతున్నారా.. తక్షణం అన్ ఇన్‌స్టాల్ చేసేయండి

టిక్‌టాక్‌కు పోటీగా వ‌చ్చిన ఇండియ‌న్ యాప్ అంటూ మిట్రాన్‌ యాప్ గురించి విప‌రీత‌మైన హైప్ న‌డిచింది. మ‌రోవైపు చైనా యాప్ అయిన టిక్‌టాక్‌ను నిషేధించాలంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగింది. ఈ రెండూ క‌లిసి మిట్రాన్ యాప్‌ను ఓవ‌ర్‌నైట్‌లో పాపుల‌ర్ చేశాయి. దీంతో ఆ యాప్ భారీగా డౌన్‌లోడ్స్ తెచ్చుకోగ‌లిగింది. అయితే సెక్యూరిటీ రీజ‌న్స్ కార‌ణంగా మిట్రాన్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి తొల‌గిస్తున్న‌ట్లు గూగుల్ ఈ రోజు ప్ర‌క‌టించింది.  

ఇండియ‌న్ కాదు.. పాకిస్తానీ
టిక్‌టాక్‌కు వ్యతిరేకంగా మిట్రాన్‌ యాప్‌ను భారత్‌  తయారు చేసిందని, దాన్ని ఐఐటీ రూర్కీ విద్యార్థి షిబాంక్ అగ‌ర్వాల్‌తో తయారు చేయించింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ఏకంగా 50 ల‌క్ష‌ల మందికి పైగా దాన్ని డౌన్‌లోడ్ చేసేశారు. అయితే వాస్తవానికి మిట్రాన్ యాప్‌.. పాకిస్తాన్‌కు చెందిన టిక్‌టిక్‌ యాప్‌ రీప్యాకేజీ వెర్షన్ అట‌.  దీన్ని తామే తయారు చేసినట్టు పాకిస్తాన్‌కు చెందిన క్యూబాక్సస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ వెల్లడించింది. ఈ యాప్‌కు సంబంధించిన పూర్తి సోర్స్‌ కోడ్ తమదేన‌ని  క్యూబాక్సస్  సీఈవో ఇర్ఫాన్‌ షేక్ చెప్పారు.

డేటా పోతోంద‌ని అనుమానాలు
అయితే  ఈ యాప్‌లో చాలా లూప్  హోల్స్ ఉన్నాయ‌ని.. యూజ‌ర్ల డేటాకు ప్రైవ‌సీ లేద‌ని  అనుమానాలు త‌లెత్తాయి. మిట్రాన్ యాప్‌లో డేటా ప్రైవ‌సీ పాల‌సీని డెవ‌ల‌ప‌ర్ అప్‌లోడ్ చేయ‌లేద‌ని  క్యూబాక్సస్ సీఈవోనే చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన డెవలపర్‌ నుంచి కొనుగోలు చేశారని తెలియ‌డం ఈ అనుమానాల‌కు మరింత ఆజ్యం పోసింది.   ఈయాప్‌లో ఎలాంటి ఫైర్‌వాల్ లేద‌ని, సోర్స్ కోడ్ కూడా సెక్యూరిటీప‌రంగా వీక్‌గా ఉంద‌ని సైబ‌ర్ ఎక్స్‌ప‌ర్ట్‌లు అంటున్నారు .  ఈ ప‌రిస్థితుల్లో మిట్రాన్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి తొల‌గించింది. ఒక‌వేళ మీ ఫోన్‌లో ఇప్ప‌టికే ఈ యాప్ ఉంటే దాన్ని అన్ఇన్‌స్టాల్ చేయ‌మ‌ని సూచిస్తున్నారు. అలాగే యాప్ డేటాను కూడా క్లియ‌ర్ చేయండి.

 

 

 

జన రంజకమైన వార్తలు