కరోనా జనం బతుకుల్ని మార్చిపారేసింది. మనింటికి మనం పోవాలన్నా పదిమంది పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తెచ్చిపెట్టింది. ఇక మనం ఏ నగరాల నుంచో, పక్క రాష్ట్రాల నుంచో, విదేశాల నుంచో వచ్చామంటే 14రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. దేశ క్షేమం కోసం, దేశంలోని ప్రజలందరి క్షేమం కోసం ఇది తప్పనిసరి. కరోనా పాజిటివ్ లేకున్నా ఇలా వచ్చినవారిని ముందుజాగ్రత్తగా 14 రోజులు ఉండమని క్వారంటైన్ విధిస్తోంది. దీన్నే హోం క్వారంటైన్ అంటున్నారు. ఎందుకంటే కరోనా లక్షణాలు 14 రోజుల్లో బయటపడతాయి. అయితే ఇలా హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వారిలో చాలామంది
పోలీసులు, అధికారులు చెప్పిన మాటలు వినకుండా బయట తిరిగేస్తున్నారు.
మానిటర్ చేయడం కష్టం
ఇలా హోం క్వారంటైన్‌లో ఉండాల్సినవారు నిజంగా దాన్ని పాటిస్తున్నారా లేదా అని మానిటర్ చేయడం ఇప్పుడు ప్రభుత్వానికి తలకు మించిన పనవుతోంది. అయితే కర్నాటక ప్రభుత్వం దీనికో మందు కనిపెట్టింది. ప్రతి గంటకు ఓ సెల్ఫీ తీసి పంపాలని ఆర్డర్ వేస్తోంది. దీంతో వీరు ఎక్కడున్నారో ఈజీగా గుర్తుపట్టే వీలుంది. వీరిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం క్వారంటైన్ వాచ్ అనే యాప్‌ను తయారు చేయించింది.
ఏమిటీ క్వారంటైన్ వాచ్? ఎలా పని చేస్తుంది?
* కర్నాటక గవర్నమెంట్ క్వారంటైన్ వాచ్ పేరుతో ఒక ఆండ్రాయిడ్ యాప్ తయారుచేయించింది.
* హోం క్వారంటైన్‌లో ఉండాల్సినవాళ్లు వాళ్ల స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* గంటకోసారి ఈ యాప్‌లో సెల్ఫీ దిగి అప్‌లోడ్ చేయాలి. దీనిలో తీసిన సెల్ఫీకి ఆటోమేటిగ్గా జియో లొకేషన్ యాడ్ అవుతుంది. కాబట్టిబయటికి వెళితే ఈజీగా తెలిసిపోతుంది
* అలా ఎవరైనా వెళ్లినట్లు తెలిస్తే వాళ్లను గవర్నమెంట్ మాస్ క్వారంటైన్ సెంటర్లకు తీసుకుపోతారు.
* రాత్రి పడుకునే సమయం అంటే 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకుతప్ప మిగిలిన 15 గంటలు గంటకో ఫోటో అప్‌లోడ్ చేయాల్సిందేనని కర్ణాటక వైద్యవిద్యశాఖ మినిస్టర్ కె. సుధాకర్ చెప్పారు.