• తాజా వార్తలు

గూగుల్ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చైనా యాప్స్ యాప్ అవుట్ అవ్వడానికి అసలు కారణం

యాప్స్ ప్రైవ‌సీ పాల‌సీ మీద గూగుల్ ప్లే స్టోర్ సీరియ‌స్‌గా దృష్టి పెట్టింది.  టిక్‌టాక్ యాప్‌కు పోటీగా వ‌చ్చిన ఇండియ‌న్ యాప్ అంటూ ప్ర‌చారం జ‌రిగిన మిట్రాన్‌ యాప్‌ను రీసెంట్‌గా ప్లే స్టోర్‌లో నుంచి తొలగించింది. ఈ యాప్ ప్రైవ‌సీ పాల‌సీని పాటించ‌డం లేదంటూ కార‌ణం చెప్పింది. ఇప్పుడు రిమూవ్ చైనా యాప్స్ యాప్‌ను కూడా ఇదే కారణంతో ప్లే స్టోర్ నుంచి తీసేసింది.

ల‌క్ష‌ల డౌన్‌లోడ్స్‌
చైనా కంపెనీల ప్రొడ‌క్ట్స్‌ను  ఇండియా నుంచి బ‌హిష్క‌రించాలంటూ సోష‌ల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో మీ ఫోన్‌లో ఉన్న చైనా యాప్స్ (టిక్‌టాక్‌, యూసీ బ్రౌజ‌ర్‌, షేర్ ఇట్ లాంటివి)ని తొల‌గించ‌డానికి అంటూ రిమూవ్ చైనా యాప్స్ పేరుతో ఓ యాప్ ప్లే స్టోర్‌లో విడుద‌లైంది.  చైనా యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే ఇది రిమూవ్ చేస్తుంద‌న్న ప్ర‌చారంతో ల‌క్ష‌ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ప్రైవ‌సీ పాల‌సీ స‌రిగా లేద‌ని
రిమూవ్ చైనా యాప్స్ యాప్ ప్రైవ‌సీ పాల‌సీని స‌రిగా పాటించడం లేద‌ని ప్లే స్టోర్ చెప్పింది. అదీకాక ఇత‌ర యాప్స్‌కి సంబంధించిన కంటెంట్ కూడా ఈ యాప్‌లో ఉంద‌ని అందుకే ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

 

జన రంజకమైన వార్తలు