నేటి స్మార్ట్ యుగం లో ప్రతీదీ డిజిటలైజ్ అవుతుంది. ఈ నేపథ్యం లో మన గ్రంథాలయాలు కూడా డిజిటలైజ్ అయితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చిందే తడవుగా మన దేశం లోనే ప్రముఖ విద్యా సంస్థ అయిన ఐఐటి ఖరగ్ పూర్ ఒక యాప్ ను డెవలప్ చేసింది. ఇప్పటికీ దేశం లో చాలా వరకూ ఈ తరహా సేవలు అందిస్తున్నప్పటికీ దీని ప్రత్యేకతలు దీనికున్నాయి. అవేమిటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ప్రపంచం మొత్తం మీద సుమారు 65 లక్షల కి పైగా పుస్తకాలను, రీసెర్చ్ పేపర్ లను, థీసిస్ లను , జర్నల్స్ ను మరియు పీరియాడికల్స్ ను పూర్తీ ఉచితంగా ఒకే ఒక క్లిక్ తో ఈ యాప్ ద్వారా చదివేయవచ్చు. దీనిని నేషనల్ డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియా గా పిలుస్తున్నారు. ఇందులో పుస్తకాల ద్వారా లభించే అనంతమైన జ్ఞానాన్ని ఎవరైనా సరే స్మార్ట్ ఫోన్ లేదా డెస్క్ టాప్ ద్వారా పొందవచ్చు.
”మొబైల్ వాడకం అనేది విపరీతంగా పెరగడం తో ఈ NDL యాప్ అనేది దేశ విదేశాల్లోని యూజర్ లకే కాక రిమోట్ ఏరియా లలోని యూజర్ లకు కూడా ఇది అనంత మైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఇది భారతీయ కోణం లోనే కాదు కానీ ప్రాపంచిక కోణం లోనే ఒక విశిష్ట మైన ఆలోచన, ప్రయత్నం. దేశ విదేశాల్లోని కొన్ని వేల సంఖ్య లోని లైబ్రరీ ల యందలి పుస్తకాలను మేము డిజిటల్ చేయడం జరిగింది, ప్రపంచం ఇంతవరకూ ఇలాంటి ఒక డిజిటల్ లైబ్రరీ ని చూసి ఉండలేదు “ అని ఐఐటి ఖరగ్ పూర్ డైరెక్టర్ అయిన PP చక్రవర్తి చెప్పారు.
ఈ యాప్ లో సెర్చ్, బ్రౌజ్, ఫిల్టర్, ట్యాగ్, కామెంట్ మరియు వ్యూ మెటా డేటా లాంటి రకరకాల ఫీచర్ లు ఉంటాయి. ఇది ఇప్పటికే 9 లక్షల యూజర్ లను కలిగిఉంది. మీరు ఏ బుక్ కోసం వెదుకుతున్నారో ఖచ్చితంగా తెలిపే అడ్వాన్స్డ్ సెర్చ్ ఫీచర్ ను కూడా ఇది కలిగిఉంది.
ఈ ప్రాజెక్ట్ భారత మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ చే ప్రారంభించబడింది. ఇందులో NCERT టెక్స్ట్ బుక్స్, ఎనిమిది రాష్ట్రాల ఎడ్యుకేషన్ బోర్డు ల టెక్స్ట్ బుక్స్ లతో పాటు UPSC, JEE, మరియు GATE ల ప్రీవియస్ పేపర్ లు NPTEL స్పోకెన్ ట్యుటోరియల్ లు, IISc , ISI, తొమ్మిది ఐఐటి లు మరియు రెండు ఐఐఎమ్ ల, రెండు IISER ల పేపర్ లు థీసిస్ లు, CSIR లాబొరేటరీ ల పబ్లికేషన్స్ , సత్య జిత్ రే సొసైటీ వారి బుక్స్, వరల్డ్ ఈ బుక్ లైబ్రరీ ,ఇలా ఎన్నో మరెన్నో ప్రముఖ , అ ప్రముఖ సంస్థల యొక్క పుస్తకాలన్నీ ఇక్కడ డిజిటల్ రూపం లో ఉంటాయి.
యూరోప్ నందలి కల్చర్ మరియు మ్యూజియం కు ప్రతీక అయిన యూరోపియనా తో కూడా ఇది ఒప్పందం కుదుర్చుకుంది. దశాబ్దం క్రితం ప్రారంభం అయిన డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియా కార్యక్రమాన్ని కూడా ఇందులో కలిపేశారు.
ఈ యాప్ ఒక నెల రోజుల క్రితం లాంచ్ చేయబడింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఒక లక్ష డౌన్ లోడ్ లను కలిగి ఉంది. మరికొద్ది రోజుల్లో ఐఒఎస్ యాప్ కూడా అందుబాటులోనికి రానుంది.