మీ ఫోన్‌లో ఏదో సాంకేతిక సమస్య వస్తుంది. లేదా ఉన్నట్టుండి మీ మొబైల్ ప్రిపెయిడ్ బ్యాలెన్స్ అయిపోతుంది.. ఇలాంటి పరిస్థితుల్లో మనం అర్జెంట్‌కు ఒక కాల్ చేయాలంటే ఏం చేస్తాం? ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా మనం ఇలా ఆలోచించామంటే మనం సాంకేతికతను సరిగా ఉయోగించుకోవాట్లేదనే అర్ధం. మనకు కంప్యూటర్ ఉందంటే ఆల్‌మోస్ట్ సాంకేతికంగా ఉండే అన్ని సమస్యలను తీరుస్తుంది. మనకు ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినా కూడా పీసీ నుంచి మొబైల్‌కు పోన్ చేయడానికి కొన్ని ఇంటర్నెట్ సాయం చేస్తుంది. ఇందుకు కొన్ని యాప్స్ ఉపయోగపడతాయి. మరి ఆ యాప్స్ ఏంటో చూద్దామా..
గూగుల్ వాయిస్
గూగుల్ అందించిన అద్భుతమైన ఆప్షన్లలో గూగుల్ వాయిస్ ఒకటి. దీని ద్వారా పీసీ నుంచి మొబైల్‌కి వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేయచ్చు. ప్రస్తుతం ఉన్నపీసీ కాల్స్ ఫీచర్లలో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. దీని ద్వారా పీసీ నుంచి మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయడమే కాక..పీసీ నుంచి పీసీకి కూడా కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. ఇవన్నీ ఉచితంగానే మనం పొందొచ్చు. ఇందుకోసం మీ మొబైల్‌లో కాంపిటబుల్ అయ్యే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. గూగుల్ వాయిస్ ఒక యూనిక్, పర్సనలైజ్డ్ నంబర్‌ను ఇస్తుంది. దీన్ని మీ సన్నిహితులకు కూడా షేర్ చేసుకోవచ్చు.
ఫేస్‌బుక్ మెసెంజర్
ఫేస్‌బుక్ గురించి తెలియనివాళ్లు ఉండరు.. అయితే ఫేస్‌బుక్ మెసెంజర్‌ను వాడేవాళ్లు మాత్రం తక్కువే ఉంటారు. మెసెంజర్‌ను మనం కాల్స్ చేయడానికి వాడుకోవచ్చు. మొబైల్ నుంచి మొబైల్‌కు కాల్స్ చేయడానికి మనం వాడుకోవచ్చని తెలుసు కానీ.. పీసీ నుంచి కూడా మొబైల్‌కి కాల్స్ చేయచ్చన్న విషయం అందరికి తెలియదు. అందుకు మీరు మీ మొబైల్‌లో ఎఫ్‌బీ మెసెంజర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా వాయిస్ కాల్స్ మాత్రమే కాక వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. పీసీ నుంచి మొబైల్‌తో పాటు పీసీ నుంచి పీసీకి కూడా కాల్స్ చేసుకోవచ్చు
టెలిగ్రామ్
వాట్సప్ అందరికి తెలిసిన మెసేజింగ్ యాప్. కానీ టెలిగ్రామ్ గురించి ఎక్కువమందికి తెలియదు. ప్రపంచవ్యాప్తంగా దీనిని వాడే వాళ్లు ఎక్కువగానే ఉన్నారు. భారత్‌లో దీని ఉపయోగం మాత్రం తక్కువే. కేవలం మెసేజ్‌లు చేసుకోవడమే కాక దీంతో కాలింగ్ కూడా చేసుకోవచ్చు. అన్నిటకన్నా మించి పీసీ నుంచి మొబైల్‌కి కాల్ చేసుకోవచ్చు. పీసీ నుంచి పీసీకి కాల్ చేసుకొని మాట్లాడొచ్చు. ఈ అప్లికేషన్ విండోస్, మాక్ ఓఎస్, లినెక్స్ ఫ్లాట్‌ఫామ్‌లలో కూడా పని చేస్తుంది.
లైన్
సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ లైన్ పెద్ద పాపులర్ కాదు. కానీ ఇది వాట్సప్, ఎఫ్‌బీ, టెలిగ్రామ్‌కు ఏమాత్రం తగ్గదు. ప్రపంచవ్యాప్తంగా లైన్‌ను బాగానే ఉపయోగిస్తున్నారు. దీని వల్ల మెసేజింగ్ పర్పస్‌తో పాటు కాలింగ్ కూడా ఉంది. మొబైల్ నుంచి మొబైల్‌కు మాత్రమే కాక పీసీ నుంచి పీసీకి కూడా కాలింగ్ చేసుకునే సదుపాయం దీనిలో ఉంది. ఇంకో విశేషం ఏమిటంటే నాన్ లైన్ యూజర్లకు కూడా మనం ఫోన్ చేసుకోవచ్చు.