• తాజా వార్తలు

మీ ఆరోగ్యాన్ని మీ కంటే అలర్ట్‌గా కాపాడే ఈ యాప్స్ మీ ఫోన్లో ఉండాల్సిందే..

టెక్నాల‌జీ పెరిగిన త‌ర్వాత ఆరోగ్యంపై చైత‌న్యం కూడా బాగా పెరిగింది.. ఒక‌ప్పుడు పొద్దున్నే లేచి వ్యాయ‌మం చేసే వాళ్లు. ఇప్పుడు వ్యాయ‌మం అనే మాట మ‌రిచిపోయారు. దీని వ‌ల్ల ఎన్నో ర‌కాల లైఫ్ స్ట‌యిల్ జ‌బ్బులు మ‌న‌ల్ని వెంటాడుతున్నాయి. అందువ‌ల్ల మ‌న‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు అల‌ర్ట్‌గా ఉంచే కొన్ని యాప్‌లు వ‌చ్చాయి. ఆ యాప్‌లు ఏంటో చూద్దామా..

ఆక్వా అల‌ర్ట్‌
విప‌రీత‌మైన బిజీలో ప‌డిపోయి త‌గినంత నీళ్లు తీసుకోక‌పోవ‌డం చాలా మామూలుగా జ‌రిగే విష‌యం. ఎప్పుడో గుర్తొచ్చి మాత్ర‌మే నీళ్లు తాగుతుంటాం. దీని వ‌ల్ల చాలా అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఇందుకోసం వాట‌ర్ ఇంటేక్ ఆక్వా అల‌ర్ట్ అనే యాప్ ఒక‌టి వ‌చ్చింది. దీని ఉండే ప్రొగ్రామ్ మీరు రోజు వారి ఎంత వాట‌ర్ తీసుకోవాలో రిమైండ‌ర్స్ పంపుతూ ఉంటుంది. మీ యాక్టివిటీ, మీ బ‌రువును బ‌ట్టి ఎంత వాట‌ర్ తీసుకోవాలో కూడా ఇది స‌జిష‌న్స్ ఇస్తూ ఉంటుంది. 

కోచ్‌.మీ
ఇష్టం వ‌చ్చినట్లు తిన‌డం, స‌రిగ్గా వేళ‌కు తిన‌క‌పోవ‌డం లాంటి వాటి వ‌ల్ల మ‌నకు ఊబ‌కాయం లాంటి స‌మ‌స్యలు ఎదుర‌వుతాయి. ఇలా బ‌రువు విప‌రీతంగా పెర‌గ‌డం వ‌ల్ల ఎన్నో స‌మ‌స్య‌లు  ఉంటాయి. అందుకే బాడీని ఎప్పూడూ స‌రైన షేప్‌లో ఫిట్‌గా ఉంచుకోవ‌డం ఎంతో ముఖ్యం. ఇందుకోసం కోచ్‌.మీ అనే యాప్ మీకు బాగా యూజ్ అవుతుంది.  ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మీకు సంబంధించి వివ‌రాలు ఇస్తే చాలు. ఇదో కోచ్‌లా మీకు గైడ్ చేస్తుంది. మీరు ఎంత బ‌రువున్నారు.. ఎంత త‌గ్గాలి... ఏం తినాలి లాంటి వివరాల‌ను అందిస్తుంది.  గోల్ సెట్ చేసుకుని మీరు ఫిట్ అయ్యే వ‌ర‌కు ప్ర‌య‌త్నించొచ్చు.

డిస్ట్ర‌స్‌
విప‌రీత‌మైన ప‌ని వ‌ల్ల మ‌న‌కు తెలియ‌కుండానే మ‌నం ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతాం. దీని వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి.  ముఖ్యంగా ఎంగ్జాయిటీ లాంటి స‌మ‌స్య‌లు, లో, హై బీపీ లాంటి ప్రాబ్ల‌మ్స్ వ‌స్తాయి. వాటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి కూడా మీకు కొన్ని యాప్‌లు యూజ్ అవుతాయి. డిస్ట్రస్ అనే యాప్ ఆ కోవ‌కే చెందుతుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని మీ శ్వాస‌, ఆలోచ‌న‌ల‌ను నియంత్రించ‌డం లాంటి ప‌నులు ఈ యాప్ ద్వారా మ‌నం అంచ‌నా వేయ‌చ్చు. మీ ఫిజిక‌ల్‌, ఎమోష‌న‌ల్‌, మెంట‌ల్ స్టేట‌స్‌ల‌ను కూడా ఇది చెబుతుంది. 

జన రంజకమైన వార్తలు