• తాజా వార్తలు

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న యాప్‌లు అన్నీ మీకు తెలుసా ?

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన  మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియాతో ఇండియా మొత్తం డిజిటల్ మయమైపోయింది. దీంతో పాటు జియో రాకతో డేటా ధరలు అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి రావడంతో ప్రతి సర్వీసు ఆన్ లైన్ లోనే లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రతిఒక్కరూ మొబైల్ యాప్స్ ద్వారా అన్ని సర్వీసులను ఈజీగా వినియోగించుకుంటున్నారు.  యాప్ ద్వారా ఎన్నో సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. అందుకే భారత ప్రభుత్వం కూడా డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించే దిశగా డిజిటల్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం యూజర్లకు ప్రభుత్వ సర్వీసులు అందేలా కొత్త మొబైల్ యాప్స్ ప్రవేశపెట్టింది.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన 7 మొబైల్ యాప్స్, వాటి సర్వీసులు ఏంటో తెలుసుకుందాం

BHIM యాప్  (భీమ్ ):
దేశంలో నగదు లావాదేవీలను డిజిటల్ రూపంలో నిర్వహించేందుకు భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ పేరుతో BHIM యాప్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భీమ్ యాప్ ను డెవలప్ చేసింది. వివిధ బ్యాంకు అకౌంట్ల నుంచి నేరుగా ఈ పేమెంట్స్ చేసుకోవడానికి వీలుగా ఈ యాప్ ను రూపొందించింది. ఇతర డిజిటల్ వ్యాలెట్లు, బ్యాంకు అకౌంట్ల మధ్య నగదు బదిలీ చేసుకునేందుకు భీమ్ యాప్ ను డిజైన్ చేశారు. 

UMANG యాప్ :
దీన్నే‘యూనిఫైడ్ మొబైల్ యాప్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్’గా పిలుస్తారు. ఈ యాప్ ను మినిస్టరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ చేసింది.అన్ని రకాల పనులను ఈ ఒక్క యాప్ ద్వారా చేసుకోవచ్చు.ఇందులో రిజిస్టర్ అయితే చాలు.. ఈ ప్లాట్ ఫాం నుంచే ఇతర యాప్స్ యాక్సస్ చేసుకోవచ్చు. మొత్తం UMANG యాప్ ద్వారా 100 సర్వీసులను ఆఫర్ చేస్తుంది. ఇన్ కమ్ ట్యాక్స్, యూటిలిటీ బిల్స్, బుకింగ్ గ్యాస్ సిలిండర్, పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెకింగ్ వంటి సర్వీసులను పొందవచ్చు. 

స్వచ్ఛ భారత్ అభియాన్ యాప్ (SBA) : 
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్ పేరుతో SBA యాప్‌ను ప్రవేశపెట్టింది. రోజుల తరబడి వ్యర్థాలను మున్సిపాలిటీ శాఖ తీసుకెళ్లలేదంటే ఈ యాప్ ద్వారా కంప్లయింట్ చేయవచ్చు. మొబైల్లో ఫొటో తీసి యాప్ లో పోస్టు చేస్తే చాలు.సంబంధిత అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ యాప్ ద్వారా సమీప మున్సిపాలిటీ కార్యాలయానికి నేరుగా ఫార్వార్డ్ అవుతుంది. 

GST Rate Finder యాప్ : 
ఈ యాప్ ద్వారా పారిశ్రామికవేత్తలు, తమ వ్యాపారానికి సంబంధించి వ్యవహారాల్లో GST రేట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. దీన్ని వ్యాపారవేత్తలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. జీఎస్టీకి సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఈ యాప్ ను డెవలప్ చేసింది. చార్టెర్డ్ అకౌంటెంట్ అవసరం లేకుండా వ్యాపార ఆదాయంలో చెల్లించాల్సిన జీఎస్టీ వంటి ట్యాక్స్ లపై అవగాహన కల్పిస్తుంది. 

Online RTI యాప్ :
RTI ఫిల్లింగ్ చేసే యూజర్లకు ఈ యాప్ ఎంతో అవసరం. RTI ఫిల్లింగ్ చేయాలంటే ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వర్చువల్ లాయర్లు, నిపుణుల సాయంతో ఆర్టీఐ ఫైల్ చేయవచ్చు. ఒకరి దరఖాస్తును ముసాయిదా చేసి సంబంధిత విభాగానికి ఆమోదం కోసం పంపడం జరుగుతుంది. 

mPassport Seva యాప్ :
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ mPassport Seva యాప్ ను డెవలప్ చేసింది. కొత్త పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఈ యాప్ ద్వారా సంప్రదించవచ్చు. అన్ని పాస్ పోర్టు సంబంధిత సర్వీసుల కోసం ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోని వినియోగించుకోవచ్చు. 

MyGov యాప్ :
భారత ప్రభుత్వం MyGov యాప్ ను ఈ మధ్య కొత్తగా ప్రవేశపెట్టింది. దీనిని భారత పౌరుల సౌకర్యార్థం కోసం అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపేందుకు ఈ యాప్ వినియోగించుకోవచ్చు . ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలన్నా, సమస్యలు చెప్పుకోవాలన్నా ఈ యాప్ ద్వారా యూజర్లు కనెక్ట్ కావచ్చు.

జన రంజకమైన వార్తలు