వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లు కొత్త కొత్త యాప్‌లను ప్రవేశపెట్టడంలో యాపిల్ ముందంజలో ఉంటుంది. మం ఫొటోలు తీసకుంటే దాన్ని మనకు నచ్చిన విధంగా ఎడిటింగ్ చేసుకునే అవకాశం ఉంటే ఎంతో బాగుంటుంది కదా! చాలా స్మార్టుఫోన్లలో ఈ ఫొటో ఎడిటింగ్ ఆప్షన్ వచ్చేసింది. ఐతే వాటిలో ఉండే ఆప్షన్లు పరిమితమే. ఐతే అన్ని ఫోన్లను డామినేట్ చేస్తూ ఒక కొత్త ఫొటో ఎడిటర్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఆ యాప్ పేరు క్లిప్స్. ఇది యాపిల్ ఐఫోన్, ఐపాడ్‌లలో లభ్యం అవుతుంది. క్లిప్స్ యాప్‌ను లైవ్‌లకి తీసుకు రావడానికి యాపిల్ నెలల తరబడి పరీక్షలు చేసింది. గతంలో ఎదురైన కొన్ని అనుభవాల దృష్ట్యా అందరి అవసరాలు తీర్చే విధంగా ఈ యాప్‌ను రూపొందించింది యాపిల్. సాధారణ ఫొటో ఎడిటర్ కన్నా ఇది చాలా భిన్నమైంది.
ఐమూవీ తరహాలో ఈ యాప్ చాలా విస్తృతంగా, వివరంగా అందరికి అర్థం అయ్యేలా ఉంటుంది. ఈ ఫొటో ఎడిటర్ యాప్‌లో ఆప్షన్లు ఎంత షార్ప్‌గా ఉన్నాయో.. ఆ యాప్ పేరుని కూడా క్లిప్స్ అని చాలా షార్ప్‌గా పేట్టింది యాపిల్. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ తరహాలో ఇది కూడా వేగంగా వినియోగదారులను ఆకర్షిస్తుందని యాపిల్ సంస్థ నమ్ముతోంది. ఈ క్లిప్స్ యాప్ ద్వారా మనం తీసుకున్న ఫొటోలకు ఆకర్షణీయమైన ఎఫెక్టులు, ఫిల్టర్లు, టెక్టు, బ్యానర్లు, స్టిక్కర్లు, ఎమోజీలు పెట్టుకునే అవకాశం ఉంది. టెక్ట్‌ను టైప్ చేసే శ్రమ కూడా అవసరం లేదు. మనం మాట్లాడితే చాలు ఆ ఫొటోలకు కాప్షన్లు కూడా యాప్ తయారు చేస్తుంది. అంతేకాదు మనం తీసుకున్న ఫొటోలకు మనకు నచ్చిన టెంప్లెట్‌లను ఎంపిక చేసుకుని వాడుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌లో ప్రస్తుతానికి 12 టెంప్లెట్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని టెంప్లెట్లు అందించడానికి యాపిల్ కృషి చేస్తోంది.
ఈ టెంప్లెట్ల మీద టాప్ లెఫ్ట్‌లో స్వైప్ చేస్తే మనకు నచ్చిన ఎమోజీలను వాడుకునే అవకాశం ఉంటుంది. ఇవి శాంపిల్స్ మాత్రమే. ఫిల్టర్లు, స్టిక్కర్లు.. బ్యానర్లు ఒకటేమిటి మీ ఫొటోలను అందంగా తీర్చిదిద్దడానికి లేని ఆప్షన్ అంటూ లేదు. ముఖ్యంగా ఇది సెల్ఫీ కాలం. ఎక్కువమంది మామూలు ఫొటోల కన్నా సెల్ఫీలే ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ సెల్ఫీలను మరింత అందంగా చేయడానికి క్లిప్స్‌కు మించిన ఆప్షన్ దొరకబోదు. మొత్తం మీద ఈ ఫొటో ఎడిటర్ ఫీచర్‌తో కొత్త వినియోగదారులను ఆకర్షించాలనేది యాపిల్ ప్రయత్నం.