• తాజా వార్తలు

గూగుల్ అథంటికేర్ యాప్‌కి వ‌న్ స్టాప్ గైడ్‌

ఇంట‌ర్నెట్ పుట్టిన నాటి నుంచి ఇప్ప‌టిదాకా ఎన్నో ర‌కాలుగా మారింది. ఎన్నో ర‌కాల ఆప్ష‌న్లు వ‌చ్చాయి. ముఖ్యంగా మ‌న స‌మాచారం సేఫ్‌గా ఉండ‌డం కోసం కొన్ని అథంటికేష‌న్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవ‌న్నీమన మ‌న అకౌంట్స్ సేఫ్‌గా ఉండ‌డం కోసం ఈ అథంటికేష‌న్స్ ప‌ని కొస్తాయి. గూగుల్ అయితే టూ ఫ్యాక్ట‌ర్ అథంటికేష‌న్‌ను ప్రొవైడ్ చేస్తుంది. ఈ అథంటికేష‌న్ యాప్‌ ఏంటో దాన్ని ఎలా ఉప‌యోగించాలో చూద్దాం..

2 ఫ్యాక్ట‌ర్ అథంటికేష‌న్‌
గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అయిన‌ప్పుడు టూ ఫ్యాక్ట‌ర్ అంథ‌టికేష‌న్ మ‌న‌కు క‌నిపిస్తుంది. ఇందులో స్టెప్ వ‌న్ ద్వారా మీరు పాస్‌వ‌ర్డ్ ఇచ్చి లోప‌లికి ఎంట‌ర్ అవుతారు.. ఆ త‌ర్వాత మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్‌కు వ‌చ్చిన నంబ‌ర్ ద్వారా రెండో స్టెప్ ఓపెన్ చేస్తారు.. ఆ త‌ర్వాత నేరుగా అకౌంట్లోకి వెళ్లిపోతారు. దీని వ‌ల్ల  యూజ్ ఏంటంటే ఎవ‌రైనా మీ అకౌంట్‌ని హ్యాక్ చేసిన‌ప్పుడు 2 ఫ్యాక్ట‌ర్ అథంటికేష‌న్ ఉండ‌డం వ‌ల్ల అంత సుల‌భంగా మీ అకౌంట్‌ని యూజ్ చేయ‌లేరు. 

ఏంటి అంథ‌టికేట‌ర్‌?
అంథ‌టికేట‌ర్ యాప్‌ని మ‌న అకౌంట్ సెక్యూరిటీ కోసం యూజ్ చేస్తారు. దీన్ని మన స్మార్ట్‌ఫోన్లో ఉంచుకుంటే 2ఎఫ్ఏ కోడ్స్‌ని జ‌న‌రేట్ చేస్తుంది. ప్ర‌తి 30 సెక్ల‌న‌కు ఇది ఒక కోడ్ జ‌న‌రేట్ చేస్తుంది. మీ అంథటికేట‌ర్ స్క్రీన్ మీద క‌నిపించే నంబ‌ర్‌ను స‌రిగా ఎంట‌ర్ చేయాలి. లేక‌పోతే లాగిన్ కావ‌డం కుద‌ర‌దు. లాగిన్ కోడ్ స‌రైన స‌మ‌యానికి ఎంట‌ర్ చేయ‌క‌పోతే అది ఎక్స్‌పైర్ అయిపోతుంది. 

ఇలా సెట్ చేసుకోండి..
1. గూగుల్ అకౌంట్లోకి వెళ్లి సెట్టింగ్స్ ఓపెన్ చేయ‌లి. ఆ త‌ర్వాత సైన్ ఇన్ చేయాలి

2. సెక్యూరిటీ అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి

3. స్క్రోల్ డౌన్ చేసుకుంటూ కింద‌కి వ‌స్తే సైనింగ్ ఇన్‌టూ గూగుల్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత 2 స్టెప్ వెరిఫికేష‌న్ క‌నిపిస్తుంది. ఆ ఆప్ష‌న్ మీద ట్యాప్ చేయాలి. 

4. ఆ త‌ర్వాత నెక్ట్ కొట్టి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. 

5. ఆ త‌ర్వాత ఐడెంటిటీ వెరిఫికేష‌న్ మెథ‌డ్‌ని ఎంచుకోవాలి. గూగుల్ ప్రాంప్ట్‌ని మీ ఫోన్ లేదా ఈమెయిల్‌కు పంపేలా సెట్ చేసుకోవాలి. అంటే ఎవ‌రైనా మీకు తెలియ‌కుండా పాస్‌వ‌ర్డ్ క్రాక్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే వెంట‌నే మీకు స‌మాచారం అందుతుంది

6. గూగుల్ ప్రాంప్ట్ వ‌చ్చార వెరిఫికేష‌న్ కోడ్ ఎంట‌ర్ చేయాలి. అప్పుడు 2 ఫ్యాక్ట‌ర్ వెరిఫికేష‌న్ ట‌ర్న్ అన్ చేయాలా అని అడుగుతుంది టర్న్ అన్ బ‌ట‌న్ మీద క్లిక్ చేయాలి.  ఆ త‌ర్వాత మీరు ఎప్పుడు జీమెయిల్ లేదా ఇత‌ర గూగుల్ సేవ‌లు వాడుతుంటే ఈ టూ ఫ్యాక్ట‌ర్ అథంటికేష‌న్ మిమ్మ‌ల్ని ప్రాంప్ట్ చేస్తుంది.

జన రంజకమైన వార్తలు