• తాజా వార్తలు

డేటాలీ యాప్‌ని గూగుల్ ఎందుకు చుప్‌చాప్‌గా డిలీట్ చేసింది?

ప్లే స్టోర్‌లో ఎన్నో యాప్‌లు మ‌న‌కు క‌న‌బ‌డ‌తాయి. వాటిలో మ‌న‌కు తెలిసిన యాప్ డేటాలీ.. దీన్ని ఎక్కువ‌గా కూడా యూజ్ చేస్తారు. ఇటీవ‌లే గూగుల్ ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి అనూహ్యంగా రిమూవ్ చేసింది. మ‌రి గూగుల్ ఇలా స‌డ‌న్‌గా ఒక యాప్‌ని ఎందుకు డిలీట్ చేసింది... ఏమిటీ దీనికి కార‌ణం!

కార‌ణం అదేనా..
డేటాలీ.. డేటా సేవింగ్ కోసం వాడే యాప్ ఇది.  ప్లే స్టోర్‌లో ఉంచిన రెండేళ్ల‌లోపే ఇది మాయ‌మైంది. ఈ డేటాలీ యాప్ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ అయిన‌ట్లు మొద‌ట ఆండ్రాయిడ్ పోలీస్ ద్వారా క‌నుగొన్నారు. బిలియ‌న్ యూజ‌ర్ల ల‌క్ష్యంతో 2017లో ఈ యాప్‌ను లాంచ్ చేసింది గూగుల్‌.  యూజ‌ర్ల మొబైల్ డేటాను సేవ్ చేసే ఉద్దేశంతో ఈ యాప్‌ను త‌యారు చేశారు. వైఫై హాట్ స్పాట్‌లు ఉన్న‌ప్పుడు ఇది యాక్టివ్‌గా ప‌ని చేసి మ‌న మొబైల్ డేటాను బ్యాక్ అప్ చేస్తుంది.  అయితే దీనిలో ఉన్న కొన్ని ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని దీన్ని రిమూవ్ చేయాల‌ని గూగుల్ నిర్ణ‌యించింది.

వాళ్ల‌కు ప‌ని చేస్తుంది
అయితే ఇప్ప‌టికే ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని వాడుతున్న వాళ్ల‌కు ఇది ప‌ని చేస్తుంది. కొత్త‌గా డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని అనుకునే వాళ్ల‌కు మాత్రం ఇది ప‌ని చేయ‌దు. అంతేకాదు ఆండ్రాయిడ్ 10 వెర్ష‌న్‌తో ఇది కంపాట‌బుల్ కాదు. కానీ ఈ డెవ‌ల‌ప్‌మెంట్ ఎందుకు జ‌రిగిందో అనే విష‌యం మీద గూగుల్ స్పందించ‌లేదు. ఇలా ఒక యాప్‌ను కిల్ చేయ‌డం గూగుల్‌కు ఇదే తొలిసారి కాదు. గ‌త‌లంలో ఇన్ బాక్స్‌, డేడ్రీమ్ లాంటి వాటిని కూడా ఇలాగే తొల‌గించింది. 

జన రంజకమైన వార్తలు