• తాజా వార్తలు

మీ ఫోన్లో ఎవ‌రైనా ఏమేమి చూడ‌గ‌ల‌రో నియంత్రించే యాప్ నింజా స్నాప్‌

ఆండ్రాయిడ్ ఫోన్ అన‌గానే ఎన్నో సున్నిత‌మైన విష‌యాలు ఉంటాయి. వాటిని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిన అస‌వ‌రం కూడా ఉంది. అయితే వీటిని అంద‌రూ చూసేయ‌డం వ‌ల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాం. మ‌రి  ఫోన్లో మీ స్నేహితులు కేవ‌లం సెలెక్టెడ్ ఫొటోల‌ను మాత్ర‌మే చూడాలంటే ఎలాగో తెలుసా?

నింజా స్నాప్‌
నింజా స్నాప్ అనేది ఒక ఫ‌న్ యాప్‌. దీన్ని మీ స్నేహితుల‌తో ప్రాంక్ చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. మీ ఫోన్ నుంచి కొన్ని ఫొటోల‌ను చూజ్ చేసి మీ స్నేహితుల‌కు ఫోన్‌ను ఎలాంటి భ‌యం లేకుండా ఇచ్చేయ‌చ్చు. దీని వ‌ల్ల మీ స్నేహితులు మీ ఫొటో గ్యాల‌రీ మొత్తాన్ని స్పైప్ చేసే అవ‌కాశం ఉండ‌దు, అంతేకాదు మీ ఫొటోల‌ను మీకు తెలియ‌కుండా చూడాల‌ని ప్ర‌య‌త్నిస్తే వారి ఫొటోల‌ను తీసి మీకు పంప‌డం ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌.  ఈ ఫొటోలు మీ గ్యాల‌రీలో ఆటోమెటిక్‌గా సేవ్ అవుతాయి. మీ ఫోన్‌ను ఎవ‌రు చెక్ చేశారో తెలుసుకోవ‌డానికి ఇదో మంచి మార్గం.

ఏం చేయాలంటే...

1. ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్లో నింజా స్నాప్ యాప్‌న డౌన్‌లోడ్ చేసుకోవాలి

2. ఒక‌సారి యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న త‌ర్వాత స్టార్ట్ ప్రాంక్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.  

3. యాప్‌ను లాంచ్ చేసేముందు సెట్టింగ్స్‌లోకి వెళ్లి అనేబుల్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.

4. మీ స్క్రీన్ మీద యాప్‌ను హైడ్ చేయాలి. ఇన్ఫినేట్ గ్యాల‌రీ మోడ్ క్లిక్ చేయాలి. 

5. అక్క‌డ మీకు మీ ఫొటోలు ఉన్న ఫోల్డ‌ర్లు క‌నిపిస్తాయి. ఇందులోంచి మీ స్నేహితుల‌కు చూపించాల‌నుకునే కొన్ని ఫొటోల‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. 

6. ఫొటోల‌ను సెల్ట‌క్ చేసుకున్న త‌ర్వాత నెక్ట్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత మీ ఫోన్‌ను స్నేహితుల‌కు ఇవ్వొచ్చు.

జన రంజకమైన వార్తలు