• తాజా వార్తలు

ఎటువంటి యాప్ లేకుండా కాల్ రికార్డింగ్ సాధ్య‌మా!

మ‌న ఫోన్లో అత్య‌వ‌స‌ర‌మైన ఫీచ‌ర్ల‌లో కాల్ రికార్డింగ్ ఒక‌టి. కొన్ని కీల‌క సాక్ష్యాల‌ కోసం ఈ కాల్ రికార్డింగ్ బాగా యూజ్ అవుతుంది. మ‌న మెమ‌రీస్ కోసం కూడా ఈ ఫీచ‌ర్‌ని ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే కాల్ రికార్డింగ్ చేయాలంటే ఏం చేయాలి.. దీనికి ఏదైనా యాప్ అవ‌స‌ర‌మా! ఎలాంటి యాప్ లేకుండానే కాల్ రికార్డింగ్ చేసుకోవ‌చ్చా? ఇలాంటి సందేహాలు మీకెప్పుడైనా వ‌చ్చాయా? మ‌రి ఎలాంటి యాప్ లేకుండా కాల్ రికార్డింగ్ సాధ్య‌మా కాదా చూద్దాం..

యుకాల్ రికార్డ‌ర్‌
సాధార‌ణంగా మ‌నం ఫోన్లో కాల్ రికార్డ్ చేయాంటే క‌చ్చితంగా యాప్ వాడ‌తాం. ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఇలాంటి యాప్‌లు కోకొల్ల‌లుగా క‌న‌బ‌డ‌తాయి. అయితే వాటిలో సుర‌క్షిత‌మైన బెస్ట్ యాప్ ఏంటో మ‌న‌కు తెలియ‌దు. ఒక్కోసారి ఫేక్ యాప్‌లు యూజ్ చేసి విలువైన స‌మాచారాన్ని నష్ట‌పోతుంటాం. అందుకే ఎలాంటి యాప్ అవ‌స‌రం లేకుండా కాల్ రికార్డింగ్ చేసే ఫీచ‌ర్లు వ‌చ్చాయి. అలాంటి స‌ర్వీసే యువ‌ర్‌కాల్‌రికార్డ‌ర్ స‌ర్వీస్‌. ఇదో ఫ్రీ స‌ర్వీస్‌. మీరు కాల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్పుడు ఈ స‌ర్వీస్ యాక్టివేట్ అయి ఒక ఎస్ఎంఎస్ ద్వారా రికార్డెడ్ ఫైల్ అవుతుంది. అయితే ప్ర‌స్తుతం ఈ స‌ర్వీస్ ప్ర‌పంచ వ్యాప్తంగా అందుబాటులో లేదు. కేవ‌లం అమెరికాలో మాత్ర‌మే ఈ ఫీచ‌ర్‌ని ఉప‌యోగిస్తున్నారు.

917 525 4569 కు రింగ్ చేయండి
యువ‌ర్ కాల్ రికార్డ‌ర్ స‌ర్వీస్ మాత్ర‌మే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి. అందులో నంబ‌ర్‌ని రింగ్ చేస్తే రికార్డ్ అయ్యే టూల్స్ కూడా వ‌చ్చాయి. ఇందుకోసం 917  525 4569 నంబ‌ర్ కు రింగ్ చేస్తే చాలు మీ కాల్ రికార్డింగ్ మొద‌లైపోతుంది.  ఒక‌సారి ఈ నంబ‌ర్ డ‌య‌ల్ చేయ‌గానే మీకో వెల్‌క‌మ్ మెసేజ్ వస్తుంది. అందులో మీరు ఏ ఫోన్‌కు కాల్ చేయ‌ద‌లుచుకున్నారో ఆ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాల్సిందిగా సందేశం క‌నిపిస్తుంది. ఆ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి యాష్ సైన్ మీద క్లిక్ చేస్తే చాలు. ఒక‌సారి ఎంట‌ర్ చేయ‌గానే ఆ నంబ‌ర్‌తో మీరెప్పుడు కాల్ చేసినా ఆటోమెటిక్ రికార్డింగ్ అవుతుంది.

జన రంజకమైన వార్తలు