• తాజా వార్తలు

ఏఐ, యాప్స్ క‌లిసి స్టెత‌స్కోప్ అవ‌స‌రం లేకుండా చేయ‌నున్నాయా?

స్టెత‌స్కోప్ గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు.. డాక్ట‌ర్ దగ్గ‌ర‌కు వెళితే మ‌న గుండె ద‌గ్గ‌ర పెట్టేసి హార్ట్ బీట్ చూడ‌డం మామూలే. కానీ  టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ అవుతున్న కొద్దీ వైద్యం కూడా సుల‌భం అయిపోతోంది.  ఇప్పుడు స్టెత‌స్కోప్ అవ‌స‌రం లేకుండానే హార్ట్ బీట్ చూసేయ‌చ్చ‌ట‌. దీనికి ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)తో పాటు యాప్స్ సాయం చేయ‌నున్నాయ‌ట. మ‌రి అదెలాగో చూద్దామా..

వైద్యుల‌కు సాయం..
స్టెత్ పెట్ట‌డం ద్వారా మన హృద‌య స్పంద‌న‌లు తెలుసుకుంటారు వైద్యులు. అంతేకాదు ఈ స్పంద‌న‌లు ఏ స్థాయిలో ఉన్నాయి.. ఏమైనా తేడాలు ఉన్నాయా.. అన‌వ‌స‌ర‌మైన సౌండ్స్ ఏమైనా వినిపిస్తున్నాయా లాంటివి ఈ స్టెత‌స్కోప్‌తో క‌నిపెట్టొచ్చు. ఇప్పుడు ఈ స్టెత్ ద్వారా చెక్ చేయ‌డాన్ని ఇంకా సుల‌భం చేసేలా కొన్ని యాప్‌లు వ‌చ్చాయి. కేవ‌లం హార్ట్ మాత్ర‌మే కాదు లంగ్స్ ఎలా ప‌ని చేస్తున్నాయో తెలుసుకోవ‌డానికి కూడా ఈ యాప్‌లు వైద్యుల‌కు సాయం చేస్తాయి.  స్టెత్‌కు అనుసంధానం చేసేలా ఉండే ఈ యాప్‌లు వైద్యుల‌కు హార్ట్  బీట్ సౌండ్స్‌, లంగ్స్ ప‌ని తీరుని తెలిసేలా చేస్తాయి. 

ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌తో..
కేవ‌లం యాప్స్ మాత్ర‌మే కాదు ఇలా ఆరోగ్యాన్ని చెక్ చేయ‌డం కోసం ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ సాయం కూడా తీసుకుంటున్నారు వైద్యులు. ఇందుకు బ‌ట‌ర్ ఫ్లై ఐక్యూ డివైజే ఉదాహ‌ర‌ణ‌. గ‌తేడాదే మార్కెట్‌లోకి వ‌చ్చిన ఈ డివైజ్ ద్వారా మ‌న ఇంటిలిజెన్స్‌ను చెక్ చేసుకోవ‌చ్చు. కేవ‌లం స్టెత‌స్కోప్ స్కిల్స్ మాత్ర‌మే కాదు హ్యాండ్ టు హ్యాండ్ ఆల్ట్రా సౌండ్ టెక్నాల‌జీని వైద్యులు నేర్చుంటున్నారు. అమెరికాలో  వైద్యు విద్యార్థులు లెర్నింగ్ అంతా ఇలా ఏఐ, యాప్స్ బేస్డ్‌గా జ‌రుగుతోంది. 

జన రంజకమైన వార్తలు