• తాజా వార్తలు

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 5 ఉత్తమమైన వెబ్‌సైట్లు మీకోసం

2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఆగస్టు 31లోపు దాన్ని ఫైల్ చేయాలి. అలా చేయలేని పక్షంలో అంటే  డెడ్‌లైన్ దాటిన తర్వాత పెనాల్టీతో ఐటీ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత 2019 డిసెంబర్ 31 లోపు రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.5,000 జరిమానా చెల్లించాలి. డిసెంబర్ 31 తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించాలి. ఇప్పుడు ప్రభుత్వ వెబ్‌సైట్ మాత్రమే కాకుండా ప్రైవేట్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

Income Tax website
ఆదాయపు పన్ను శాఖకు చెందిన incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. ఆదాయపు పన్ను సంబంధిత సేవలన్నీ ఈ పోర్టల్‌లో పొందొచ్చు. మొదటిసారి ఇ-ఫైలింగ్ చేస్తున్నటైతే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫామ్ 16 (అందుబాటులో ఉంటే), పెట్టుబడుల వివరాలు ఉండాలి.

2ClearTax: 
బెంగళూరుకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఇది. ఈ వెబ్‌సైట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ సేవల్నీ అందిస్తుంది. ఫామ్ 16 ఉన్నవారు ఆ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేస్తే చాలు ఐటీ రిటర్న్స్ ఇ-ఫైలింగ్ చాలా సులువు అవుతుంది. చివర్లో మీకు అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. ఐటీ రిటర్న్స్ ఇ-ఫైలింగ్‌కు కేవలం 7 నిమిషాలు పడుతుందని క్లియర్‌ట్యాక్స్ వెబ్‌సైట్ చెబుతోంది.

myITreturn: 
ఇది 2006 సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖలో రిజిస్టర్ అయింది. ఇది స్కోరీడోవ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. ఇందులో వేతనం, పెట్టుబడులు, లాభాలు, ఆదాయం లాంటి వివరాలతో ఐటీఆర్ ఇ-ఫైల్ చేయొచ్చు. ఇంగ్లీష్‌తో పాటు 9 భారతీయ భాషల్లో సేవలు లభిస్తాయి.

TaxSpanner: 2007 లో న్యూ ఢిల్లీ, బెంగళూరులోఈ సంస్థ ప్రారంభమైంది. ఇందులో మీరు ఫామ్ 16 అప్‌లోడ్ చేస్తే ఐటీఆర్ ఫైల్ చేయడానికి కావాల్సిన సమాచారాన్ని స్కాన్ చేస్తుంది. మీరు ఎంచుకునే ప్యాకేజీని బట్టి నిపుణుల సేవలు లభిస్తాయి.

Paisabazaar: పాలసీబజార్ గ్రూప్‌కు చెందిన సంస్థ పైసాబజార్ కూడా ఉచితంగా ఐటీఆర్ ఇ-ఫైలింగ్ సేవల్ని అందిస్తోంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది ఈ వెబ్‌సైట్. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో నిపుణుల సలహాలు కూడా పొందొచ్చు.

ఇవే కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు ఇలాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఐటీఆర్ ఫైలింగ్‌ సేవల్ని అందిస్తున్నాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా సులువుగా ఇ-ఫైలింగ్ చేయొచ్చు.అలాగే ఇ-ఫైల్ ఐటీఆర్, అప్‌లోడ్ రిటర్న్, ట్యాక్స్ క్యాలిక్యులేటర్, ఇ-పే ట్యాక్స్, ఇ-వెరిఫై రిటర్న్స్ లాంటి సేవలు పొందొచ్చు.

జన రంజకమైన వార్తలు