• తాజా వార్తలు

ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్ అయిన‌ప్పుడు కూడా ప‌ని చేసే 5 మెసేజింగ్ యాప్‌లు మీకు తెలుసా?

ఇంట‌ర్నెట్‌.. కంప్యూట‌ర్ ఓపెన్ చేయ‌గానే మ‌న‌కు అత్య‌వ‌సరం. ఇంట‌ర్నెట్ లేకుండా కంప్యూట‌ర్ కేవ‌లం డ‌బ్బా మాత్ర‌మే అంటే అతిశ‌యోక్తి కాదు.  ఏదైనా కార‌ణాల‌తో ఇంట‌ర్నెట్ ఆగిపోతే మీ కాళ్లు చేతులు ప‌ని చేయ‌వు. కొద్దిసేపు ఏం చేయాలో అర్ధం కాదు. అంత‌గా నెట్‌కు అల‌వాటుప‌డిపోయాం. అయితే ఇంటర్నెట్ ష‌ట్ డౌన్ అయినా ప‌ని చేసే 5 యాప్‌లు ఉన్నాయ‌న్న సంగ‌తి తెలుసా? మ‌రి  ఆ ఐదు యాప్‌లు ఏమిటో తెలుసుకుందామా!

ఫైర్ చాట్ 
ఫైర్ చాట్ మెసేజింగ్ యాప్‌. దీన్ని ఉప‌యోగించ‌డానికి ఎలాంటి ఇంట‌ర్నెట్ లేదా డేటా అవ‌స‌రం లేదు. ఇది ఓపెన్ వైర్‌లెస్ స‌ర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. బ్లూటూత్ లేదా వైఫై హాట్ స్పాట్‌ల‌ను యూజ్ చేసుకుని ఇది ప‌ని చేస్తుంది. ఫైర్ చాట్ ద్వారా మెసేజ్‌లు మాత్ర‌మే కాదు ఇమేజ్‌లు కూడా పంపుకోవ‌చ్చు. 

సిగ్న‌ల్‌
ఇంట‌ర్నెట్ లేకుండా ఉప‌యోగించుకునే మ‌రో యాప్ సిగ్న‌ల్‌. దీని ద్వారా వితౌట్ ఇంట‌ర్నెట్ మ‌నం స్నేహితుల‌తో క‌మ్యునికేట్ చేసుకోవ‌చ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యాప్ ఉచితంగా ల‌భిస్తుంది. ఇందులో చాలా ఫీచ‌ర్లు ఉన్నాయి. వాయిస్ కాల్స్‌, వీడియో కాల్స్‌, టెక్ట్ మెసేజ్‌లు, మ‌ల్టీమీడియా మెసేజ్‌లు చేసుకోవ‌చ్చు. 

మెనీవ‌ర్స్‌
క్లౌడ్ మీద ఆధార‌ప‌డ‌కుండా నేరుగా మ‌న‌కు సేవ‌లందించే మ‌రో సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ యాప్ పేరే మెనీ వ‌ర్స్. మిగిలిన యాప్‌ల‌తో పోలిస్తే ఇది చాలా బిన్న‌మైన యాప్‌. ఇది కంపెనీ ఆన్‌లైన్ క్లౌడ్ సిస్ట‌మ్ లేదా ఇత‌ర క్లౌడ్ సిస్ట‌మ్‌కు ఇది క‌నెక్ట్ అయి ఉండ‌దు. ఈ ఫోన్ల‌లోనే ఇది డేటా రూపంలో స్టోర్ అయి ఉంటుంది. దీన్ని ఎక్క‌డైనా ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవ‌చ్చు. 

బ్రియ‌ర్‌
రిల‌య‌బిలిటీ మ‌రియు రౌబుస్ట్ సిస్ట‌మ్ ద్వారా ప‌ని చేసే మ‌రో యాప్ బ్రియ‌ర్. వైఫై లేదా బ్లూటూత్ ద్వారా ఇది ప‌ని చేస్తుంది. ఈ యాప్ యాక్టివిస్ట్‌లు, జ‌ర్న‌లిస్ట్‌లు బాగా ఉప‌యోగిస్తారు. మైవ‌ర్స్ మాదిరిగానే బ్రియ‌ర్ ప‌ని చేస్తుంది. సెంట్ర‌ల్ స‌ర్వ‌ర్ ద్వారా ఇది మెసెజ్‌ల‌ను సింక్ చేసుకుంటుంది. దీనిలో పంపే మెసెజ్‌లు ఎన్‌క్రిప్ట‌డ్‌గా ఉంటాయి.

టెక్టీ
ఇదో ఇన్నోవేటివ్ యాప్‌. మ‌ల్టీపుల్  ఫంక్ష‌న్ల కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఇంట‌ర్నెట్ స్లో గా ఉన్నా కూడా ఇది వెబ్ పేజీల‌ను చూపిస్తుంది. ఇంట‌ర్నెట్ యాక్సెస్ లేక‌పోయినా ఒక సింగిల్ పాయింట్ నుంచి ఇన్ఫ‌ర్మేష‌న్‌ను గేద‌ర్ చేయ‌డానికి ప‌నికొస్తుంది. దీని ద్వారా ట్విట‌ర్‌కు నేరుగా లింక్స్ షేర్ చేసుకోవ‌చ్చు. టెక్టి క‌స్ట‌మ్ యూఆర్ఎల్‌, ఎడిట్ కోడ్‌ల‌ను క్రియేట్ చేస్తుంది. 

జన రంజకమైన వార్తలు