• తాజా వార్తలు

విద్యార్థుల ఆర్థిక అవసరాలు తీర్చే వినూత్న యాప్ ఖాళీ జేబ్‌

డిజిటల్ పేమెంట్ రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. దేశీయ కంపెనీలు కాదు విదేశీ కంపెనీలు సైతం ఈ రంగంలో పోటీకి సై అంటున్నాయి. ఇప్పటికే చైనా మొబైల్ కంపెనీలు ఒప్పో, షియోమి, వివో కూడా డిజిటల్ ఫైనాన్స్ పేమెంట్స్ బిజినెస్‌లోకి వచ్చేశాయి. ఈ పరిస్థితుల్లో డిజిటల్ పేమెంట్స్‌, ఆన్‌లైన్ లెండింగ్ బిజినెస్‌కు ఆయువుపట్టు అయిన యువతను టార్గెట్ చేస్తూ ఖాళీ జేబ్ అనే కొత్త యాప్ రంగంలోకి దిగింది. యువతను ఆకట్టుకోవడానికి ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు పెట్టి వారి  అభిమానాన్ని పొందాలని యాప్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

29 ఏళ్లలోపు వారికి ప్రత్యేక ఆఫర్లు
ఖాళీ జేబ్ యాప్ యూపీఐ బేస్డ్ పేమెంట్స్ మరియు బ్యాంకింగ్ అవసరాలు తీరుస్తుంది. స్టూడెంట్స్, యంగ్ ఎంప్లాయిస్ టార్గెట్ గా ఈ యాప్ డిజైన్ చేయబడింది. ముఖ్యంగా 29 ఏళ్ల లోపు యూజర్లే లక్ష్యంగా వారికి డిస్కౌంట్లు, లాయల్టీ ప్రోగ్రామ్‌లు, ఆఫర్లు అందిస్తుంది. సమీపంలోని ఈట‌రీస్, సెలూన్స్‌లో ఈ యాప్ ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి.

యూత్ కదా అందుకే..
ఖాళీ జేబ్ యాప్ ఐదుగురు అహ్మదాబాద్ ట్రిపుల్ ఐటీ ఫ్రెండ్స్ ఆలోచ‌న  యూత్ కాబట్టి వారి అవసరాలు ఏంటి, దేనికి ఎట్రాక్ట్ అవుతారు ఇవన్నీ ఈ కుర్రవాళ్ళకు బాగా తెలుసు. దానికి తగ్గట్లే యాప్ డిజైన్ చేశారు. ప్రస్తుతం వీళ్ల బృందంలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు  

బెంగళూరులో ప్రారంభం
ఖాళీ జేబ్ యాప్ ప్రస్తుతం బెంగళూరులో సర్వీసెస్ ప్రారంభించింది. త్వరలో ఇతర న‌గరాలకు కూడా  విస్తరించాలని యాప్ నిర్వాహకులైన యువత ఆలోచిస్తున్నారు.

 

జన రంజకమైన వార్తలు