• తాజా వార్తలు

ట్రూకాలర్‌లో ఉండే ఆరు బెస్ట్ ఫీచర్స్ మీకోసం

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మొబైల్ లో ప్రధానంగా ట్రూకాలర్ యాప్ ఉంటుంది. అయితే ఇన్నాళ్లూ మీ మొబైల్‌కు ఎవరు కాల్‌ చేశారో మాత్రమే చెప్పిన ట్రూకాలర్‌...బ్యాంకింగ్‌ సేవలు, మొబైల్‌ రీఛార్జ్‌, వీడియో కాల్స్‌... లాంటి కొత్త కొత్త ఆప్షన్లతో వచ్చింది. మీరు మీ ట్రూకాలర్ నుంచి ప్రధానంగా చూసేది. నంబర్ ఎవరిది అని మాత్రమే కదా..అయితే మీరు మీ ట్రూకాలర్ ఓపెన్ చేసినప్పుడు ప్రధానంగా ఈ ఫీచర్లను కూడా ఓ సారి చెక్ చేససుకోండి.  

ట్రూకాలర్‌ పే
ట్రూకాలర్‌ ఆప్‌ నుంచి డబ్బులు పంపించుకోవచ్చు, అందుకోవచ్చు. ట్రూకాలర్‌ పే పేరుతో ఓ సర్వీసును ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి ఈ ఆప్షన్‌ను ప్రారంభించింది. ఆప్‌లోని ఈ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే ఓ యూపీఐ ఐడీ క్రియేట్‌ అవుతుంది. దీని ద్వారా ఏదైనా యూపీఐ ఐడీ, భీమ్‌ ఆప్‌తో అనుసంధానమై ఉన్న మొబైల్‌ నంబరుకు డబ్బులు పంపించుకోవచ్చు. అంతేకాదు ఈ ఆప్‌ ద్వారా మొబైల్‌ రీఛార్జిలూ చేసుకోవచ్చు.

ట్రూకాలర్‌ ఎస్‌ఎంఎస్‌
మీ మొబైల్‌లోని మెసేజ్‌ ఇన్‌బాక్స్‌ను పూర్తిగా యాక్సెస్‌ చేయగలిగేలా ట్రూకాలర్‌ ఎస్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దీని వల్ల మెసేజ్‌లు పంపించే విధానం, స్పామ్‌ ఎస్‌ఎంఎస్‌లు గుర్తించే విధానం మరింత సులభతరమవుతుంది. ముందుగా సిద్ధం చేసుకున్న మెసేజ్‌లు (ప్రీ డిఫైన్డ్‌ మెసేజ్‌లు) పంపించుకునే సౌలభ్యమూ అందుబాటులోకి వచ్చింది.

ఎయిర్‌టెల్‌ ట్రూకాలర్‌ ఐడీ
ఎవరు కాల్‌ చేస్తున్నారో ట్రూకాలర్‌ ద్వారా తెలుసుకోవాలంటే కచ్చితంగా నెట్‌ ఉండాల్సిందే. అంతర్జాలం లేనివాళ్లకు ఉపయుక్తంగా ఉండేలా ఎయిర్‌టెల్‌తో కలసి ట్రూకాలర్‌ కొత్తగా ‘ఎయిర్‌టెల్‌ ట్రూకాలర్‌ ఐడీ' ఆప్షన్‌ను తీసుకొస్తోంది. మీకు ఎయిర్‌టెల్‌ నెంబరు నుంచి కాల్‌ వస్తే అప్పుడు నెట్‌ వినియోగించకపోయినా ఆ వ్యక్తి వివరాలు ట్రూకాలర్‌ ఆప్‌లో కనిపిస్తాయి. త్వరలో వచ్చే అవకాశం ఉంది.

చెక్ లాస్ట్ సీన్
కాంటాక్ట్ పక్కన ఉండే సమాచారం ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. అక్కడే ఉండే కాంటాక్ట్స్ పై క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం అంతా అక్కడే ఉంటుంది. ఆ వ్యక్తి ఆన్ లైన్లో ఉన్నాడా.. లాస్ట్ సీన్ స్టేటస్ లను కూడా చెక్ చేయవచ్చు.

మీ అనంబర్ అన్ లిస్ట్ 
మీ నంబర్ ట్రూ కాలర్లో కనిపించడం ఇష్టం లేదా...అయితే మీరు https://www.truecaller.com/unilistingను 

జన రంజకమైన వార్తలు