• తాజా వార్తలు

మీ మ్యూజిక్ ఫైల్స్‌ని వివిధ ఫార్మాట్స్‌లోకి క‌న్వ‌ర్ట్ చేసే బెస్ట్ యాప్స్ మీకోసం..

మ్యూజిక్ అంటే ఇష్టం ఉండ‌నివారు ఉండ‌రు. అందులోనూ స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చిన త‌ర్వాత సంగీత ప్రియుల‌కు మ్యూజిక్ మ‌రింత చేరువ అయిపోయింది. ఆన్‌లైన్‌లో లెక్క‌లేన‌న్ని మ్యూజిక్ యాప్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. వీటిలో మ‌న‌కు న‌చ్చిన యాప్‌లను యూజ్ చేసుకుని పాట‌లు వింటాం. అయితే మ‌న‌కు బాగా ఇష్ట‌మైన సాంగ్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాం. మ‌రి ఈ సాంగ్ ఫైల్స్‌ని భిన్న‌మైన ఫార్మాట్ల‌లో క‌న్వ‌ర్ట్ చేయ‌డం ఎలాగో తెలుసా?

మీడియా హ్యుమ‌న్ కన్వ‌ర్ట‌ర్
గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీడియా ఆడియో క‌న్వ‌ర్ట‌ర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. మ్యాక్‌, విండోస్‌, ఉబంటు ఫ్లాట్‌ఫామ్స్‌లో ఇది వ‌ర్క్ చేస్తుంది. భిన్న ర‌కాల ఆడియో ఫైల్స్‌ని క‌న్వ‌ర్ట్ చేయ‌డం, ఒకేసారి మ్యూజిక్ ఫోల్డ‌ర్ మొత్తం ఇంపోర్ట్ చేయ‌డం, ఐట్యూన్స్ నుంచి ప్లే లిస్టుని క‌న్వ‌ర్ట్ చేయ‌డం, ఔట్ పుట్ సెట్టింగ్స్‌ని క‌స్ట‌మైజ్ చేయ‌డం లాంటి ప‌నుల‌ను ఈ యాప్ నిర్వ‌హిస్తుంది.

క‌న్వ‌ర్టియో
మ్యూజిక్ క‌న్వ‌ర్ట్ యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండానే ఆన్‌లైన్ ద్వారా మ్యూజిక్ ఫైల్స్‌ని క‌న్వ‌ర్ట్ చేసుకోవ‌డం కోసం క‌న్వ‌ర్టియో అనే టూల్‌ మీకు యూజ్ అవుతుంది. మ‌ల్టీపుల్ ఫైల్స్‌ని అప్‌లోడ్ చేసి క‌న్వ‌ర్టియో ద్వారా క‌న్వ‌ర్ట్ చేసుకోవ‌చ్చు. యూఆర్ ఎల్‌, గూగుల్ డ్రైవ్‌, డ్రాప్ బాక్స్ అకౌంట్ ద్వారా క‌న్వ‌ర్టియోని యూజ్ చేసుకోవ‌చ్చు. గ‌రిష్టంగా 100 ఎంబీ ఫైల్ సైజుని మాత్ర‌మే క‌న్వ‌ర్టియో ఎక్స్‌ప్ట్ చేస్తుంది. 

అక‌న్వ‌ర్ట్‌
క‌న్వ‌ర్టియో మాదిరిగానే అక‌న్వ‌ర్ట్ ప‌ని చేస్తుంది. మీ కంప్యూట‌ర్‌లోని ఆడియో ఫైల్స్‌ని ఇది క‌న్వ‌ర్ట్ చేస్తుంది. వెబ్ అడ్రెస్‌, డ్రాప్ బాక్స్ లాంటి వాటి నుంచి ఇది ఫైల్స్‌ని క‌న్వ‌ర్ట్ చేస్తుంది. దీనిలో ప్ర‌త్యేక‌త ఏంటంటే  200 ఎంబీ సైజు ఫైల్స్‌ని కూడా క‌న్వ‌ర్ట్ చేస్తుంది. రెండు సాంగ్స్ లిమిటేష‌న్ లాంటి నిబంధ‌న‌లు ఉండ‌వు. మీ ఫోన్ లేదా ట్యాబ్ నుంచి యాక్సెస్ చేయ‌డానికి ఇది ఒక క్యూఆర్ కోడ్‌ని కూడా క్రియేట్ చేస్తుంది.

జన రంజకమైన వార్తలు