• తాజా వార్తలు

పర్సనల్ లోన్స్ ఇస్తున్న ఈ 4 యాప్స్.. ప్లే స్టోర్ నుంచి అవుట్.

షార్ట్ టర్మ్ లోన్స్ ఇచేందుకు ఇప్పుడు ప్లే స్టోర్లో యాప్స్ కూడా వచ్చేశాయి.అయితే లోన్స్ పేరుతో మోసం చేస్తున్నాయని , అధిక వడ్డీలను వసూలు చేస్తున్నాయంటూ  ఇందులో  4 యాప్స్ ను  గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది.                                          
 ఆ యాప్స్ వివరాలు ఇవిగో                    
 1 ) ఓకే క్యాష్                                                
ఈ యాప్ కస్టమర్ ఫైనాన్సియల్ ప్రొఫైల్ ఆధారంగా రూ.3వేల నుంచి రూ.1లక్ష వరకు లోన్ ఇస్తుంది. 3 నెలల నుంచి సంవత్సరం  లోపు తిరిగి చెల్లించాలి . కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా వడ్డీ వసూలు చేస్తారు.            
 2 ) గో క్యాష్                                                
  ఈ యాప్ రూ.3వేల నుంచి రూ.1లక్ష వరకు లోన్ ఇస్తుంది. 91రోజుల నుంచి ఏడాది లోపు తిరిగి చెల్లించాలి. ఎంత వడ్డీకి అప్పిస్తారు అనేది కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా నిర్ణయిస్తారు.  
  3)ఫ్లిప్ క్యాష్                                        
ఇది ప్రత్యేకంగా ఇండియన్ వినియోగదారులకు మాత్రమే లోన్స్ ఇస్తుంది. అత్యవసర ఆర్ధిక  అవసరాల్ని తీరుస్తుంది. .                                      
4) స్నాప్ఇట్ లోన్  ఇది కూడా కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ ను బట్టి పర్సనల్ లోన్ ను అందిస్తుంది.

జన రంజకమైన వార్తలు