ఇండియాలో స్లో ఇంటర్నెట్ యూజర్ల కోసం యూ ట్యూబ్ గో యాప్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది. లాస్ట్ ఇయర్ బీటా వెర్షన్‌ను తీసుకొచ్చిన గూగుల్ ఇప్పుడు పే స్టోర్‌లో దాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆసియాలోనే ఇంటర్నెట్ స్లోగా ఉండే దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఇలాంటి కనెక్షన్లున్న ఇండియన్ యూజర్ల కోసం ఈ యాప్‌ను తీసుకొచ్చినట్లు గూగుల్ ప్రకటించింది.
ఈ యాప్ ద్వారా యూజర్లు యూ ట్యూబ్ వీడియోలను సేవ్‌చేసుకుని ఆఫ్‌లైన్లో కూడా చూడొచ్చు. ఇంటర్నెట్ అవాయిలబులిటీని బట్టి వీడియో రిజొల్యూషన్ ను తగ్గించుకునే ఫెసిలిటీ కూడా ఉంది. వై ఫై డెరెక్ట్ క్యాపబులిటీ ని బట్టి యూజర్లు వీడియోలను షేర్ కూడా చేసుకోవచ్చు. ఇది యూట్యూబ్ గో యూజర్లకు మాత్రమే ప్రత్యేకం.
ఇండియాలో ఇంటర్నెట్ కనెక్షన్లు బాగా పెరిగినప్పటికీ ఎక్కువ శాతం స్లో కనెక్షన్లేనని అకమాయి అనే సంస్థ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలోని ఇంటర్నెట్ యూజర్లలో 30 శాతం మంది మాత్రమే 4 ఎంబీఎస్ స్పీడ్‌తో ఉన్న ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ గో యాప్ ఇండియన్ యూజర్లకు బాగా ఉపయోగపడుతుందని గూగుల్ భావిస్తోంది. బీటా వెర్షన్‌లో కొన్ని ప్రతికూలతలను గుర్తించామని, వాటిని రెక్టిఫై చేసుకోవడం ద్వారా యూజర్లకు యూట్యూబ్ వీడియోలను చూసేందుకు అవసరమైన వెసులుబాట్లను కల్పించామని సంస్థ ప్రకటించింది. దగ్గరలో ఉన్నఫ్రెండ్స్‌తో వీడియో షేరింగ్‌కు కూడా ఈయాప్ ఉపయోగపడుతుందని చెప్పింది. ప్లో కనెక్షన్లున్న మొబైల్ ఫోన్లతోపాటు పీసీ యూజర్లకు కూడా యూ ట్యూబ్ గో యాప్ ఉపయోగపడుతుందని అనౌన్స్ చేసింది.