మొబైల్ ఫోన్‌లో వీడియో ఎడిటింగ్ అంటే చాలా కష్టం.. ఎడిటింగ్ టూల్స్ డౌన్లోడ్ చేయాలంటే చాలా మెమరీ వేస్ట్.. ఫార్మాట్లు కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. పైగా చాలా ఎడిటింగ్ యాప్స్ కాస్ట్ బేర్ చేయాలి. అందుకే చాలా మంది వీడియో ఎడిటర్లు ట్రై చేయరు. ఈ హజిల్స్ ఏమీ లేకుండా వీడియో ఎడిటింగ్‌కు ఈజీ, ఫ్రీ యాప్ అందుబాటులోకి తెచ్చింది ఐవోఎస్.. పేరు క్లిప్స్.. ఐ ఫోన్‌కే ప్రత్యేకం.
క్లిప్స్ ఐ ఫోన్ యూజర్లకు ఫ్రీ. 50 ఎంబీ లోపే ఉంటుంది కాబట్టి డౌన్లోడ్, స్టోరేజ్ కూడా ఈజీనే. వీడియో స్టాండర్డ్స్‌తో పోల్చుకుంటే క్లిప్స్ చాలా తక్కువ స్పేస్‌లో మంచి వీడియో ఎడిటింగ్ యాప్ అని చెప్పాలి. డివైస్‌లో స్టోరయి ఉన్న ఇమేజెస్, వీడియోస్‌తో క్లిప్స్‌లో ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. లేదా యాప్‌లో డైరెక్ట్‌గా వీడియో షూట్ చేసుకోవచ్చు. అది కూడా హజిల్ ఫ్రీగానే ఉంటుంది. కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే హోల్డ్ టు రికార్డ్ వస్తుంది. ఈ ఆప్షన్‌ను క్లిక్ చేసి వీడియో రికార్డ్ చేయాలి. రికార్డింగ్ చేసేటప్పుడు జూమ్ చేయాలంటే వేళ్లతో పించ్ చేస్తే చాలు.
ఇన్‌స్టాగ్రామ్‌లా
ఇన్‌స్టాగ్రామ్ లో ఇమేజెస్‌ను ఎలా ఎడిట్ చేస్తామో క్లిప్స్ అలాగే వీడియోను ఎడిట్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎడిట్ చేసిన ఫొటోను అక్కడే షేర్ చేయాలి. అదే క్లిప్స్‌లో అయితే వీడియోను కావలసిన ప్లాట్‌ఫారం మీద షేర్ చేసుకునే అవకాశం ఉంది.
సూపర్ ఆప్షన్స్
వ్యూ ఫైండర్‌కు పైన చాలా ఆప్షన్లు ఉంటాయి. ట్రాన్స్‌స్క్రిబ్లింగ్ అనే ఆప్షన్ ద్వారా వీడియోతోపాటు వాయిస్ ను రికార్డ్ చేసి సబ్‌టైటిల్సగా క్రియేట్ చేయొచ్చు. ఎనిమిది రకాల ఎఫెక్ట్స్, స్టిక్కర్లు, ఎమోజీలు, టైటిల్ స్క్రీన్లు.. ఇలా చాలా ఆప్షన్లు యాడ్ చేసుకోవచ్చు. వీడియో క్రియేట్ చేశాక కావలసినంత సైజులో ట్రిమ్ చేసుకునే వీలుంది. కావాలంటే మరిన్ని ఇమేజెస్, వీడియోలను యాడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. కావల్సిన ప్లాట్‌ఫారంపై షేర్ చేసుకోవచ్చు.