• తాజా వార్తలు

శాంసంగ్ గెలాక్సీ యూజర్ల దగ్గర తప్పకుండా ఉండాల్సిన టాప్ 9 యాప్స్ 

Samsung Galaxy Note 10 and Note 10 Plus ఫోన్లు వాడుతున్నారా.. అయితే ఇందులో అనేక రకాలైన ఆసక్తికర ఫీచర్లు ఉన్నాయి. అలాగే చాలా ఫీచర్స్ ఇందులో ఫ్రీ లోడెడ్ గా కూడా వచ్చాయి. శాంసంగ్ బెస్ట్ ఫోన్ అనుకున్నా ఈ రోజుల్లో ఏ ఫోన్ కూడా అంత సేఫ్టీ కాదనేది మాత్రం కాదనలేని వాస్తవం. ఇందుకు శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ కూడా మినహాయింపు కాదు. అయితే ఈ ఫోన్లు ఇతర ఫోన్ల కన్నా కొన్ని కొత్త ఫీచర్లు, యాప్స్ ఉన్నాయి.  పిక్చర్ కోసం ధర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో ఉండగా ఈ ఫోన్లో నేరుగా ఇమేజ్ ఎడిటర్ ఆప్సన్ ఉంది. ఈ శీర్షికలో భాగంగా శాంసంగ్ గెలాక్సీ యూజర్ల దగ్గర తప్పకుండా ఉండాల్సిన టాప్ 9 యాప్స్  గురించి తెలుసుకుందాం.

SNAPSEED
వైడ యాంగిల్ షాట్స్ లేక HDR photosని క్యాప్చర్ చేసేందుకు బెస్ట్ ఫోన్ ఏదైనా ఉందంటే అది Galaxy Note 10 అనే చెప్పాలి. ఈ ఫోటోలను మరింత అందంగా క్యాప్చర్ చేయాలంటే ఈ ఫోన్లో తప్పనిసరిగా SNAPSEED ఉండి తీరాల్సిందే. దీని ద్వారా RAW imagesని కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. brightness, contrast, or saturation వంటి వాటిని కూడా ఇందులో modify చేయవచ్చు.

SWIFTKEY
డీఫాల్ట్ శాంసంగ్ కీ బోర్డ్ ఎప్పటికీ గ్రేటే. అయితే స్మార్ట్ కీ బోర్డ్ కావాలనుకునే యూజర్లు ఫాస్ట్ ఇన్ పుట్ కావాలనుకునే యూజర్లు దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. శాంసంగ్ కీబోర్డ్ హ్యాండ్ రైటింగ్ కు ఇది మరింత అందాన్నిస్తుంది.

KM PLAYER
4కె వీడియోలు చూడాలనుకునే వారు ఈ యాప్ ని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. కొన్ని యాప్స్ అన్ని రకాల ఫార్మాట్లను సపోర్ట్ చేయవు. అయితే ఈ యాప్ ఏ పార్మాట్లోనైనా మీకు వీడియోని చూపిస్తుంది.

SHAREME
రెండు ఫోన్ల మధ్య ఏవైనా ఫైల్స్ ట్రాన్స్ ఫర్ చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ యాప్. ఈ యాస్ ద్వారా మీరు నేరుగా కంప్యూటర్ లోకి షేర్ చేసుకోవచ్చు. FTP connection ద్వారా ఇది పనిచేస్తుంది.

PANORAMACROP
amazing wide-angle shots క్యాప్చర్ చేసి వాటిని Instagramలో పోస్ట్ చేయాలనుకుంటున్నారా..వారి కోసం ఈ యాప్ సిద్ధంగా ఉంది. ఫోటో ఎక్కడా మిస్ కాకుండా కట్ కాకుండా చేసుకోవచ్చు.

SMS ORGANIZER
మెసేజ్ లు సరికొత్తగా కావాలనుకున్న వారికి ఈ యాప్ మంచి ఉపయోగకారి అవుతుంది.

PIXALOOP
cinemagraph లా మీరు తీసిన చిత్రాలు కావాలనుకుంటే ఈ యాప్ ఉండి తీరాల్సిందే. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఈ యాప్ ద్వారా మీరు తీసిన చిత్రాలకు అదనంగా కొన్ని ఎఫెక్ట్స్ జోడించవచ్చు.

GOOD LOCK
 customization lovers కోసం ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది.  lock screen customization అలాగే task managerని ఈ యాప్ మరింత ఆకర్షణీయంగా చూపిస్తుంది. 

PAPERDRAW
డ్రాయింగ్ అలాగే స్కెచ్ వేయాలనుకునే వారికి ఇది ఫర్ఫెక్ట్ యాప్. శాంసంగ్ పెన్ ద్వారా ఈ యాప్ సాయంతో మీకు నచ్చిన వాటిని బొమ్మలుగా వేసుకోవచ్చు.


 

జన రంజకమైన వార్తలు