• తాజా వార్తలు

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పరికరాలు మీదగ్గర తప్పకుండా ఉండాల్సిందే

ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైనది. అరోగ్యం బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలం. ఈ ఆరోగ్యానికి కొన్ని టెక్నాలజీ గాడ్జెట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి మానవ జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఇందులో భాగంగానే కంపెనీలు కూడా ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. యూజర్ల అభిరుచులకు అనుగుణంగా ఇవి మార్కెట్లోకి వచ్చాయి. మీ దైనందిన జీవితంలో వీటి అవసరం తప్పక ఉంటుందనే కొన్ని గాడ్జెట్ల లిస్ట్ ఇస్తున్నాం. ఓ సారి ప్రయత్నించి చూడండి. 

Smartwatch
ఇది నిత్యజీవితంలో చాలా అవసరం. మీరు వాకింగ్ చేసే సమయంలో, రన్నింగ్ చేసే సమయంలో మీ ఫిజికల్ యాక్టివిటీని ఈ స్మార్ట్ వాచీ కంట్రోల్ చేస్తుంది. ఎప్పటికప్పుడు మీ బాడీలో జరిగే మార్పులను మీకు తెలియజేస్తుంది. ఐఫోన్ యూజర్లయితే ఆపిల్ వాచీలు, స్మార్ట్ ఫోన్ యూజర్లు అయితే శాంసంగ్ స్మార్ట్ వాచీలు వాడుకోవచ్చు. 

Health apps
మీ స్మార్ట్ ఫోన్లో కనీసం ఒక హెల్త్ యాప్ అయినా ఉంచుకోండి. గూగుల్ ప్లే స్టోర్ లో అనేక రకాలైన హెల్త్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు నచ్చని యాప్స్ మీ ఫోన్లో ఉంచుకోండి. మీహెల్త్ కి సంబంధించిన సమాచారాన్ని ఇవి మీకు అందిస్తాయి. ఈ మధ్య కొన్ని కంపెనీలు కూడా ఫోన్లో ఇన్ బుల్ట్ గా హెల్త్ యాప్స్ ని అందిస్తున్నాయి. Activity, MyFitnessPal, Mi Fit, Nike Run Club వంటి యాప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.

ఆడియో వియర్ బుల్స్
మీరు జిమ్ లో వర్క్ చేస్తున్నట్లయితే మీకు నెక్ బాండ్స్ అనేవి చాలా అవసరమవుతాయి. ఇవి కేవలం మెడికల్ కి మాత్రమే కాదు. Realme Buds, Samsung earbuds and AirPods వంటి వాటిని మీరు ధరిస్తే జిమ్ లో మీకు సమయమే తెలియకుండా వర్క్ అవుట్ చేసుకోవచ్చు.

Air purifiers
ఇది మీకు చాలా ఉపయోగపడే పరికరం. దీని ద్వారా మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఫ్రెష్ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. స్వచ్ఛమైన గాలిని పొందవచ్చు. ఇవి మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. 

జన రంజకమైన వార్తలు