ల్యాప్‌టాప్ కొనుక్కోవాలని చాలామందికి ఉంటుంది. లాక్‌డౌన్‌తో చాలామంది ఇది ఇప్పుడు ఇంటి నుంచే పని చేయడానికి కంపెనీలు పర్మిషన్స్ ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసమే ఈ టిప్స్
1. మీ బడ్జెట్ ఎంతో నిర్ణయించుకోండి
ల్యాప్‌టాప్ కొనాలి అనుకున్నప్పుడు ముందుగా నిర్ణయించుకోవాల్సింది బడ్జెట్. ఒకసారి మీరు బడ్జెట్ ఫిక్స్ అయితే ఆ ప్రైస్ రేంజ్ లో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏమిటో సెర్చ్ చేయొచ్చు.
2. ప్రాసెసర్ అండ్ ర్యామ్
తర్వాత చూడాల్సింది ప్రాసెసర్ మరియు ర్యామ్. ప్రాసెసర్ ల్యాప్‌టాప్ సామర్థ్యాన్ని సూచిస్తే ర్యామ్ ఒకేసారి మీరు ఎక్కువ టాస్క్‌లు చేయడానికి అవసరమవుతుంది. సాధారణంగా ల్యాప్‌టాప్‌ల్లో ఇంటెల్ లేదా ఏఎండీ ప్రాసెసర్ ఉంటుంది. సాధారణ యూసేజ్‌కి అయితే ఇంటెల్ కోర్ ఐ3 చిప్ ఉన్న ల్యాప్‌టాప్ చాలు. ఐ3 ప్రాసెసర్ ఉన్న 4లేదా 8జీబీ ర్యామ్ మీకు సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ యూసేజ్ ఉంటుందనుకుంటే ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ ఉన్న ల్యాప్‌టాప్ తీసుకోండి. మీరు ల్యాప్‌టాప్‌తో హెవీ యూసేజ్, మల్టిపుల్ టాస్క్‌లు చేసేవారయితే ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ ఉన్న ల్యాపీ తీసుకోండి. ర్యామ్ కూడా 16జీబీ ఉంటే మంచిది.
3.సైజ్
ల్యాప్‌టాప్‌లో చూడాల్సిన మరో ముఖ్యాంశం దాని సైజ్. సాధారణంగా ఇప్పుడు ల్యాపీలన్నీ 15.6 ఇంచెస్ సైజ్‌లో వస్తున్నాయి. ఇంట్లోనో, ఆఫీస్‌లోనో వాడకానికి అయితే ఇది మంచి ఆప్షన్. అయితే ఈ మధ్యన 14 ఇంచెస్ స్క్రీన్‌తో వస్తున్నవీ ఉంటున్నాయి. మీరు తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉండేవారయితే బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకుని తీసుకెళ్లడానికి ఈ 14 ఇంచెస్ ల్యాప్‌టాప్‌లు బాగా సూటవుతాయి.
4.స్టోరేజ్
ఇక ల్యాప్‌టాప్‌లో ఎంత స్టోరేజ్ ఉంటే అంత మంచిది. స్టోరేజ్ తక్కువున్నవి తీసుకుంటే మళ్లీ డేటాను తీసుకోవడానికి హార్డ్ డిస్క్‌లు కొనాలి. వాటిని మెయింటెయిన్ చేయాలి. అందుకే ఇప్పుడు ల్యాపీలు కూడా 500 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజ్‌తో వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా తక్కువ బరువుతో సాలిడ్ స్టేట్ డ్రైవ్స్‌తో కూడిన ల్యాపీలు వస్తున్నాయి. వీటిని చూడొచ్చు. అయితే మీకెంత స్టోరేజ్ అవసరమో మీకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీ ల్యాపీ కొనుగోలు ఉండాలి.
5.బ్యాటరీ
ల్యాప్‌టాప్ కొనుగోలులో అత్యంత కీలకమై అంశం బ్యాటరీ బ్యాకప్. ల్యాప్‌టాప్‌ను మనం వైర్‌లెస్‌గానే ఎక్కువ వాడుతుంటాం కాబట్టి బ్యాటరీ బ్యాకప్ చాలా కీలకం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం 4 నుంచి 6 గంటల బ్యాకప్ ఇచ్చే ల్యాపీలు కొనుక్కోవడం బెటర్. 8 గంటల బ్యాకప్ వస్తే ఇంకా సూపర్.