• తాజా వార్తలు

50వేల లోపు ధ‌ర‌లో బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవీ..  


ల్యాప్‌టాప్స్‌లో బోల్డ‌న్ని ర‌కాలు.. స్క్రీన్ సైజ్ నుంచి ప్రారంభించి 2 ఇన్ 1లు, ఆల్ట్రాబుక్స్‌, క్రోమ్ బుక్స్ ఇలా ఎన్నో వేరియంట్లు. ఏది కొనాలో తెలియ‌ని గంద‌ర‌గోళం. 50 వేల రూపాయ‌ల్లోపు ధ‌ర ప‌లుకున్న 5 బెస్ట్ ల్యాపీలు గురించి తెలుసుకోండి. 

 లెనోవో ఐడియా పాడ్ 210  
ల్యాపీ సెగ్మెంట్‌లో బాగా పేరున్న‌లెనోవో నుంచి వ‌చ్చిన ఈ మోడ‌ల్ ఇంట‌రెస్టింగ్ స్పెక్స్‌తో యూజ‌ర్స్‌ను ఆకట్టుకుంటోంది.   1920 x 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌తో 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే చూడడానికి చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్ట్  సెవెన్త్ జ‌న‌రేష‌న్ ఇంటెల్ కోర్ ఐ5 7200 యూ ప్రాసెస‌ర్‌,  NVIDIA GeForce N16V-GMR1 గ్రాఫిక్స్ కార్డ్ ,, విజువ‌ల్స్‌ను రిచ్‌గా చూపించ‌డానికి, గేమ్స్ ప్లే చేసుకోవ‌డానికి, ఫాస్ట‌ర్ ఆప‌రేటింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 4జీబీ  DDR4  ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌తో వ‌చ్చిన ఈ ల్యాపీ విండోస్ 10 హోం ఓఎస్‌తో న‌డుస్తుంది. 39WHr కెపాసిటీ ఉన్న రెండు బ్యాట‌రీల‌తో ప‌వ‌ర్వ‌ప్ అవుతుంది. డాల్బీ ఆడియో ప్రీమియం సౌండ్ టెక్నాల‌జీ హోం థియేట‌ర్ క్వాలిటీ సౌండ్‌నిస్తుంది.  
ప్రైస్‌: 49,797
 
ఆసుస్ వివోబుక్  
ఆసుస్ వివోబుక్‌1920 x 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌తో 15.6 ఇంచెస్  హెచ్‌డీ ఎల్ఈడీ బ్లాక్ లిట్ డిస్‌ప్లేతో వ‌చ్చింది.  అల్యూమినియం బాడీ తో స్లీకీ లుక్ క‌నిపిస్తుంది. ఇంటెల్ కోర్ ఐ5 7200 యూ ప్రాసెస‌ర్‌,  NVIDIA GeForce 930MX, 2 జీబీ  GDDR5  విర్యామ్ తో కూడిన గ్రాఫిక్ కార్డ్  మంచి పెర్‌ఫార్మెన్స్ ఇస్తాయి. 4జీబీ ర్యామ్ ఎక్స్‌పాండబుల్ అప్‌టు 16జీబీ SDRAM , 1టీబీ స్టోరేజ్ ఉన్నాయి.  39WHr కెపాసిటీ ఉన్న పాలిమ‌ర్ బ్యాట‌రీతో ప‌వ‌ర్ అప్ అవుతుంది. యూఎస్‌బీ 3.1 టైప్ సీ పోర్ట్‌, యూఎస్‌బీ సీ జెన్ 1 పోర్ట్‌, ఒక మైక్రో  హెచ్‌డీఎంఐ పోర్ట్,  ఎస్డీ కార్డ్ రీడ‌ర్‌, ఏసీ ఎడాప్ట‌ర్ ప్ల‌గ్ ఇచ్చారు. వైఫై 802.11 AC, బ్లూటూత్ v4.1 క‌నెక్టివిటీతో వ‌చ్చింది.  
ప్రైస్‌: 49,990

హెచ్‌పీ పెవిలియ‌న్ ఎక్స్ 360
 1920 x 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌తో 13.3 6 ఇంచెస్  ఫుల్ హెచ్‌డీ  డిస్‌ప్లేతో రిలీజైంది .  ఇంటెల్ కోర్ ఐ3 -7100 యూ ప్రాసెస‌ర్‌,  ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్ 620 గ్రాఫిక్స్ కార్డ్‌, 4జీబీ DDR4 ర్యామ్ , 1టీబీ స్టోరేజ్ ఉన్నాయి.  ఇంటిగ్రేటెడ్ న్యూమ‌రిక్ కీస్‌తో ఉన్న ఫుల్ సైజ్ ఐలాండ్ టైప్ కీ బోర్డు ఈ ల్యాపీ ప్ర‌త్యేక‌త‌.  లేటెస్ట్ విండోస్ 10 హోం ఓఎస్‌తో న‌డుస్తుంది. 42WHr కెపాసిటీ ఉన్న మూడు  బ్యాట‌రీలు ప‌వ‌ర్ బ్యాక‌ప్ ఇస్తాయి.  క‌నెక్టివిటీ కోసం యూఎస్‌బీ 3.0  పోర్ట్‌, రెండు యూఎస్‌బీ 2.0 పోర్ట్‌లు,  ఒక  హెచ్‌డీఎంఐ పోర్ట్,  1 RJ-45 ఎథ‌ర్నెట్ పోర్ట్‌, మ‌ల్టీ ఫార్మాట్ ఎస్డీ కార్డ్ రీడ‌ర్‌, వైఫై 802.11 AC, బ్లూటూత్  4.2 ఉన్నాయి.  
ప్రైస్‌: 49,990
 
డెల్ ఇన్‌స్పిరాన్ 15 5578 టూ ఇన్ వ‌న్ 
50 వేల ప్రైస్ రేంజ్‌లో బెస్ట్ ఆప్ష‌న్ ఇది.  1920 x 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌తో 15.6 ఇంచెస్  ఫుల్‌ హెచ్‌డీ ఎల్ఈడీ బ్లాక్ లిట్ డిస్‌ప్లేతో వ‌చ్చింది. ట‌చ్ స్క్రీన్ ఆప్ష‌న్ ఉంది.   సెవెన్త్ జ‌న‌రేష‌న్ ఇంటెల్ కోర్ ఐ3- 7100 యూ ప్రాసెస‌ర్‌తో లేటెస్ట్ విండోస్ 10 హోం ఓఎస్‌తో ర‌న్న‌వుతుంది.  ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్ 620 గ్రాఫిక్స్ కార్డ్ ,  4జీబీ DDR4 ర్యామ్ , 1టీబీ స్టోరేజ్ ఉన్నాయి.42WHr కెపాసిటీ ఉన్న మూడు  బ్యాట‌రీలు ప‌వ‌ర్ బ్యాక‌ప్ ఇస్తాయి.   క‌నెక్టివిటీ ఆప్ష‌న్లుగా యూఎస్‌బీ 3.0  పోర్ట్‌లు రెండు, ఒక యూఎస్‌బీ 2.0 పోర్ట్ ,  ఒక  హెచ్‌డీఎంఐ పోర్ట్,  10/100 RJ-45 ఎథ‌ర్నెట్ పోర్ట్‌, ఎస్డీ కార్డ్ రీడ‌ర్‌, వైఫై 802.11 AC, బ్లూటూత్  4.2, నోబుల్ లాక్ సెట్ ఇచ్చారు.  
ప్రైస్‌: 49,990

ఏస‌ర్ స్పిన్ 5 
50 వేల ప్రైస్ రేంజ్‌లో మ‌రో ట‌ఫ్ కాంపిటీట‌ర్ ఏసర్ స్పిన్‌.  1920 x 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌తో 15.6 ఇంచెస్  ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో వ‌చ్చింది.  సెవెన్త్ జ‌న‌రేష‌న్ ఇంటెల్ కోర్ ఐ3- 7100 యూ ప్రాసెస‌ర్‌తో లేటెస్ట్ విండోస్ 10 హోం ఓఎస్‌తో ర‌న్న‌వుతుంది.  ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్ 620 గ్రాఫిక్స్ కార్డ్ ,  4జీబీ ర్యామ్ , 256 జీబీ హార్డ్ డ్రైవ్  ఉన్నాయి. ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం డ్యూయ‌ల్ స్పీక‌ర్స్ ఇచ్చారు.  నాలుగు లిథియం అయాన్  బ్యాట‌రీలు 5 గంట‌ల ప‌వ‌ర్ బ్యాక‌ప్ ఇస్తాయి.    క‌నెక్టివిటీ కోసం యూఎస్‌బీ 3.0  పోర్ట్‌లు రెండు, ఒక యూఎస్‌బీ 2.0 పోర్ట్ ,  యూఎస్‌బీ 3.1 పోర్ట్ ఒక‌టి,  హెచ్‌డీఎంఐ పోర్ట్,  ఎస్డీ కార్డ్ రీడ‌ర్‌, వైఫై 802.11 AC, బ్లూటూత్  4.2 ఇచ్చారు.  
ప్రైస్‌: 49, 213

జన రంజకమైన వార్తలు