• తాజా వార్తలు

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కొన‌డానికి 6 బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవీ..

ల్యాప్‌టాప్ ఉంటే ఆ సుఖ‌మే వేరు. ఎక్క‌డిక‌యినా బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్లిపోవ‌చ్చు. ఎడ్యుకేష‌న్ టెక్నాల‌జీతో బాగా లింక‌య్యాక కాలేజ్ స్టూడెంట్స్ కూడా ల్యాపీలు త‌ప్ప‌నిస‌రి అంటున్నారు. అలాగే బిజినెస్  ఎగ్జిక్యూటివ్స్‌, ఆఫీస‌ర్లు ల్యాప్‌టాప్‌ల‌తోనే  ఎక్క‌డ నుంచి అయినా ప‌ని చ‌క్క‌బెట్టేస్తున్నారు. అయితే స్టూడెంట్స్ ల్యాప్‌టాప్స్ ఎకన‌మిక్ రేంజ్‌లో ఉంటుంటే ఆఫీస్ ప‌ర్ప‌స్‌వి కాస్త ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటున్నాయి.  ఎడ్యుకేష‌న్, ఆఫీస్ ప‌ర్ప‌స్‌ల‌కు కూడా ప‌నికొచ్చే కొన్ని ల్యాపీల వివ‌రాలు మీకోసం..
 

1. యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (Apple MacBook Air)
పోర్ట‌బులిటీ, పెర్‌ఫార్మెన్స్ రెండూ కావాల‌నుకునేవారికి యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ మంచి ల్యాప్‌టాప్‌. డాక్యుమెంట్స్‌ప్రిప‌రేష‌న్‌, ప్ర‌జంటేష‌న్స్‌, బ్రౌజింగ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ వంటి సింపుల్ టాస్క్‌ల‌కు ఇది సూటబుల్ ల్యాపీ. అంటే ఆఫీస్ వ‌ర్క్ విత్ కొద్దిగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోరుకునేవారికి మంచి ఆప్ష‌న్‌.  వీడియో ఎడిటింగ్‌, డిజైనింగ్ వంటి హెవీ టాస్క్‌ల‌కు వ‌ర్క‌వుట్ కాదు. ఈ ల్యాపీ 9 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్ ఇస్తుంది. ఇంటెల్ ఐ5 చిప్‌సెట్‌, 128 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌తో వ‌చ్చే ఈ ల్యాపీ ఖ‌రీదు ఆన్‌లైన్‌లో 60వేల‌కు దొరుకుతుంది. ధ‌ర కాస్త ఎక్కువైనా యాపిల్ ప్రొడ‌క్ట్ కావ‌డంతో దీన్ని కొనుక్కోవ‌చ్చు.

2. డెల్ ఎక్స్‌పీఎస్ 13 (Dell XPS 13)
బిజినెస్ క్లాస్ ల్యాప్‌టాప్ ఇది. ఇంట్లోనే ఉన్నా ఆఫీస్ వ్య‌వ‌హారాల‌న్నీ ల్యాపీలో చ‌క్క‌బెట్టేసుకోవాల‌నుకునేవారికి ఇది మంచి ఆప్ష‌న్‌.  ప‌వ‌ర్‌ఫుల్ కాబీ లేక్ ప్రాసెస‌ర్ ఉంది. 13.3 ఇంచెస్ స్క్రీన్ చిన్న‌దే అయినా బీజిల్‌లెస్ డిస్‌ప్లే ఉండ‌డంతో స్క్రీన్ మామూలు ల్యాపీల్లాగే క‌నిపిస్తుంది. క‌ల‌ర్‌ఫుల్‌, ఇన్‌డెప్త్ డిస్‌ప్లే ఉంది.16జీబీ ర్యామ్ వ‌ర‌కు అప్‌గ్రేడ్ చేసుకోవ‌చ్చు. 1టీబీ M2 SSD డ్రైవ్ ఉంది. 22 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్ ఇస్తుంది. 
ధ‌ర దాదాపు 85వేలు పైనే 

3. ఆసుస్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ (ASUS Chromebook Flip)
ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్‌కు బాగా ఉప‌యోగ‌ప‌డే మోడ‌ల్ ఇది. పీడీఎఫ్‌లు, వ‌ర్డ్ డాక్యుమెంట్స్‌లో ఉండే స్ట‌డీమెడీరియ‌ల్‌ను యాక్సెస్ చేసుకోవ‌డానికి, ఈ లెర్నింగ్ పోర్టల్స్‌ను బ్రౌజ్ చేసుకోవ‌డానికి, ఆఫ్‌లైన్‌లో యాప్స్ యూజ్ చేసుకోవ‌డానికి ఆసుస్ క్రోమ్ బుక్ ఫ్లిప్ చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. విండోస్ మాదిర‌గా ఎక్కువ ర్యామ్, ప్రాసెసింగ్ ప‌వ‌ర్ అవ‌స‌రం లేక‌పోవ‌డం ఈ క్రోమ్‌బుక్‌ల ప్ర‌త్యేక‌త‌. ఫ్లిప్ ఫామ్ ఫాక్ట‌ర్ ఉండడంతో మూవీలు, వీడియోలు చూడ‌డానికి సౌక‌ర్యంగా ఉంటుంది. ధ‌ర 33వేల వ‌ర‌కు ఉంది.

4.లెనోవో ఐడియా ప్యాడ్ 320 ఎస్ (Lenovo Ideapad 320S)
సింపుల్‌గా,ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండే ల్యాపీ కోసం చూస్తుంటే మీకు సూట‌బుల్  అయ్యే మోడ‌ల్ లెనోవో ఐడియా ప్యాడ్ 320 ఎస్‌. లేటెస్ట్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెస‌ర్‌,  14 ఇంచెస్ డిస్‌ప్లే,  ఈ ప్రైస్ రేంజ్‌లో మంచి కీబోర్డు, డీసెంట్ బ్యాట‌రీ బ్యాక‌ప్ ఉన్న ఈ ల్యాపీ ధ‌ర 44వేల వ‌ర‌కు ఉంది. 

5. ఏస‌ర్ స్విఫ్ట్ 3 (Acer Swift 3)
ఏస‌ర్ నుంచి ఈ స్విఫ్ట్ 3 మోడ‌ల్ ల్యాపీ చూడ‌డానికి అచ్చం యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్‌లాగే ఉంటుంది. అయితే లోప‌ల విండోస్ మెషీన్ ఉంటుంది.  సిక్స్త్ జ‌న‌రేష‌న్ ఇంటెల్‌కోర్ ఐ3 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌తో మంచి పెర్‌ఫార్మెన్స్ ఇస్తుంది. 128జీబీ ఎస్ఎస్‌డీ ర్యామ్ ఉన్న ఈ ల్యాప్టాప్ లిన‌క్స్ ఓఎస్‌తో కూడా ప‌ని చేస్తుంది.  విండోస్ వ‌ద‌ల‌కుండా యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ లాంటి పెర్‌ఫార్మెన్స్, లుక్ కోరుకునేవారికి ఈ ఏస‌ర్‌స్విఫ్ట్ మంచి ఛాయిస్‌. ధ‌ర ఆన్‌లైన్‌లో 40వేల వ‌ర‌కు ఉండ‌డంతో త‌క్కువ ధ‌ర‌లో ల్యాపీ కొనాల‌నుకున్న‌వారికి కూడా మంచి ఆల్ట‌ర్నేట్‌.

6.హెచ్‌పీ స్పెక్ట‌ర్ ప్రో 13 (HP Spectre Pro 13)
ధ‌ర ఎక్కువైనా ఫ‌ర్వాలేదు ప్రీమియం లుకింగ్‌, మంచి ప‌వ‌ర్‌ఫుల్ ల్యాపీ కావాల‌నుకుంటే హెచ్‌పీ స్పెక్ట‌ర్ ప్రో 13 కొనుక్కోవ‌చ్చు. ఇది ప్ర‌పంచంలో అతి ప‌లుచని ల్యాప్టాప్ అని కంపెనీ చెబుతోంది. లేటెస్ట్ సిక్త్ జ‌నరేష‌న్ ఐ7 ప్రాసెస‌ర్‌,   256 జీబీ వ‌ర‌కు పీసీఐఈ బేస్డ్ ఎస్ ఎస్‌డీ స్టోరేజ్ ఉన్నాయి.మూడు యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌లు ఉండ‌డంతో ఛార్జింగ్‌,డేటా ట్రాన్స్‌ఫ‌ర్ లాంటి మ‌ల్టిపుల్ ఫంక్ష‌న్స్‌ను ఒకేసారి చేసుకోవ‌చ్చు. మార్కెట్‌లో ఉన్న అడ్వాన్స్‌డ్ ల్యాపీల్లో ఇది ముందుంటుంది. ధ‌ర 1,10,000 పైనే.

జన రంజకమైన వార్తలు