ల్యాప్‌టాప్ ఎక్కడికయినా తీసుకెళ్లొచ్చు. ఈజీ టూ క్యారీ. ఈజీ టూ యూజ్. కానీ చిక్కల్లా ఛార్జింగ్‌తోనే. డైలీ యాక్టివ్ యూజర్లు వాళ్లు వాడనప్పుడల్లా పీసీని ఛార్జర్‌కు తగిలించి ఉంచడం చూస్తూనే ఉంటాం. ల్యాపీకి పెద్ద గండంగా ఉన్న ఈ ఛార్జింగ్ సమస్యకు మైక్రోసాఫ్ట్ ఓ సొల్యూషన్ తీసుకొచ్చింది. దానిపేరే ఆల్వేస్ కనెక్టెడ్ పీసీ. ఆల్వేస్ కనెక్టెడ్ పీసీని గత మంగళవారం హవాయిలో మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేసింది. విండోస్ 10 ఓఎస్‌తో క్వాల్‌కామ్ ఎస్‌వోసీ ప్రాసెసర్‌తో పని చేసే ఆసుస్, హెచ్‌పీ ల్యాప్ టాప్స్‌ను ప్రదర్శించింది. బిల్ట్ ఇన్ LTE కనెక్టివిటీతో వచ్చే ఈ ల్యాపీలు x86 PCల కన్నా ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటాయి.
ఆసుస్ నోవా గో
ఇది ప్రపంచంలో తొలి గిగాబైట్ ఎల్‌టీఈ కన్వర్టబుల్ ల్యాప్‌టాప్. క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 835 మొబైల్ ప్రాసెసర్‌తో పవర్ అప్ చేశారు. దీనిలో ఉండే 52 వాట్స్ పర్ హవర్ బ్యాటరీ 30 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. యాక్టివ్ యూజర్లకు కూడా 22 గంటల పాటు నడుస్తుంది. 4జీబీ, 8జీబీ ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి. 64జీబీ, 128 జీబీ, 256 జీబీ ఫ్లాష్ స్టోరేజ్ వెర్షన్లు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ కోసం USB 3.1 Gen 1 టైప్ ఊ పోర్ట్స్ రెండు, ఒక హెచ్‌డీఎంఐ పోర్ట్ ఇచ్చారు. 13.3 ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉన్న ఈ ల్యాపీలో ఈ-సిమ్, నానో సిమ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఆసుస్‌లో 4జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ 32వేలు, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 52వేల వరకు ఉండొచ్చు.
హెచ్‌పీ ఎన్వీ ఎక్స్2
ఆల్వేస్ కనెక్టెడ్ పీసీ రేంజ్‌లో హెచ్‌పీ నుంచి వచ్చిన ల్యాపీ ఇది. దీనిలో బిల్ట్ ఇన్ 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీ ఉంది. విండోస్ 10ఎస్, స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 16 ఎల్‌టీఈ మోడెంతో కూడా పని చేస్తుంది. ఇది కూడా ఎల్‌టీఈ కన్వర్టబుల్ ల్యాప్‌టాపే. ఒక్కసారి ఛార్జ్ చేస్తే యాక్టివ్ యూజర్లు కూడా 20 గంటలపాటు వాడుకోవచ్చు. క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 835 మొబైల్ ప్రాసెసర్‌తో పవర్ అప్ చేశారు. 8జీబీ LPDDR4X PoP ర్యామ్ , 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 12.3 ఇంచెస్ WUXGA+ డిస్‌ప్లే, ఎలాంటి లైటింగ్‌లోనైనా స్మూత్ టైపింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం బాక్‌లిట్ కీబోర్డ్ ఉన్న ఈ ల్యాపీ వెయిట్ జస్ట్ 700 గ్రాములు మాత్రమే. దీన్ని కీ బోర్డ్ నుంచి డిటాచ్ చేసి ట్యాబ్‌లాగా కూడా వాడుకోవచ్చు.