యాపిల్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐ ప్యాడ్ 10.9 ఇంచెస్ మోడల్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. శాన్ జోస్‌లో జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2017)లో దీన్ని రిలీజ్ చేసింది. దీనితోపాటు 12.9 ఇంచ్ ఐప్యాడ్ ప్రో రిఫ్రెష్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ రెండు వేరియంట్లు ఈ నెల తర్వాత నుంచి ఇండియాలో అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది.
ఐ ఓఎస్ 10తోనే..
ఈ రెండు వేరియంట్లు ఐ ఓఎస్ 10తోనే వస్తాయి. అయితే వీటికి ఐ ఓఎస్11 అప్‌డేట్లు ఇస్తామని యాపిల్ చెప్పింది. న్యూ ఫైల్స్ యాప్, కస్టమైజబుల్ డాక్, ఇంప్రూవ్డ్ మల్టీ టాస్కింగ్, యాపిల్ పెన్సిల్‌తో ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లతో ఈ రెండు ఐ ప్యాడ్ ప్రో మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి.
కొత్త ఫీచర్లు
* డాక్యుమెంట్ స్కానర్ ఆప్షన్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. యూజర్లు డాక్యుమెంట్లను స్కాన్ చేసి స్టోర్ చేసుకోవడంతోపాటు వాటి క్వాలిటీని పెంచుకోవచ్చు.
* కస్టమైజబుల్ డాక్ తో తరచూ యూజ్ చేసే యాప్స్‌ను ఏ స్క్రీన్ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్‌ను ఇంప్రూవ్ చేశారు. మల్టీ టచ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ను ఈ ఐ ప్యాడ్స్ సపోర్ట్ చేస్తాయి.
* యాపిల్ పెన్సిల్, స్మార్ట్ కీబోర్డ్ కావాలంటే విడిగా కొనుక్కోవాలి. స్మార్ట్ కీబోర్డ్ 30 భాషలను సపోర్ట్ చేస్తుంది. కస్టమైజ్డ్ వెర్షన్లు కూడా దొరుకుతాయి. వీటి ధర 150 డాలర్లకు పైగా ఉంటుంది.
* ప్రో మోషన్ టెక్నాలజీ ఈ కొత్త మోడల్స్‌లో స్పెషల్. ఈ టెక్నాలజీ రిఫ్రెష్ రేట్‌ను భారీగా పెంచుతుంది. డిస్‌ప్లే క్వాలిటీని పెంచడంతోపాటు పవర్ యూసేజ్‌ను తగ్గిస్తుందని యాపిల్ చెప్పింది.
* 64 బిట్ ఏ 10 ఎక్స్ ఫ్యూజన్ చిప్.. సిక్స్ కోర్ సీపీయూ, 12 కోర్ జీపీయూతో ఈ రెండు మోడల్స్ ఐ ప్యాడ్లు వస్తాయి.
* 12 ఎంపీ రియర్ కెమెరా, 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ హెచ్‌డీ కెమెరా ఉంటాయి.
* ఎంబెడెడ్ యాపిల్ సిమ్, వోల్ట్ టెక్నాలజీతో పని చేస్తాయి.
* యాపిల్ పేతో పేమెంట్స్ చేసుకునే ఆప్షన్ ఉంది.
ధరలు ఇలా ఉంటాయి
10.5 ఇంచెస్ ఐ ప్యాడ్ ప్రో సిల్వర్, స్పేస్ గ్రే,గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్స్‌లో దొరుకుతుంది. 64 జీబీ వైఫై మెడల్ ధర యూఎస్‌లో 649 డాలర్స్ (దాదాపు 42వేల రూపాయల) నుంచి ప్రారంభమవుతుంది. 64 జీబీ వైఫై విత్ సెల్యులర్ మెఓడల్ ధర 779 డాలర్లు (50వేల రూపాయల) నుంచి మొదలవుతుంది.
* 12.9 ఇంచెస్ ఐ ప్యాడ్ ప్రో కూడా సిల్వర్, స్పేస్ గ్రే,గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్స్‌లో దొరుకుతుంది. 64 జీబీ వైఫై మెడల్ ధర యూఎస్‌లో 799 డాలర్స్ (51,480 రూపాయల) నుంచి ప్రారంభమవుతుంది. 64 జీబీ వైఫై విత్ సెల్యులర్ మెఓడల్ ధర 929 డాలర్లు (దాదాపు 60వేల రూపాయల) నుంచి మొదలవుతుంది.
ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్స్‌లో వీటిని ఆర్డర్ చేస్తే వారం రోజుల్లో పంపిస్తామని యాపిల్ చెప్పింది. అయితే ఇండియాలో ఎప్పటి నుంచి సేల్స్ ప్రారంభమవుతాయో కచ్చితమైన వివరాల్లేవు.