కంప్యూటర్ గురించి తెలిసినవారికి మొజిల్లా ఫైర్‌ఫాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విండోస్ క్రోమ్ అందుబాటలో లేనప్పుడు ఫైర్‌ఫాక్సే ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఉపయోగపడింది. ఇప్పటికి ఎక్కువమంది ఫైర్‌ఫాక్స్ ఇంటర్‌ఫేస్‌నే వాడుతుంటారు. ఐతే వేగాన్ని దృష్టిలో ఉంచుకుని ఫైర్‌ఫాక్స్ స్థానంలో క్రోమ్ వాడకం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు ఫైర్‌ఫాక్స్ ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగానే ఫైర్‌ఫాక్స్ ఫెర్మార్‌మెన్స్ మీద దృష్టి సారించింది. ఇకపై ఫైర్‌ఫాక్స్ ఇంటర్‌ఫేస్ సెట్టింగ్స్‌లో ఫెర్మార్‌మెన్స్ ట్యాబ్‌ను యాడ్ చేయనుంది. ఈ ట్యాట్ ప్రధాన ఉద్దేశం ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను వేగవంతం చేయడమే. ఇంకా పాతకాలం కంప్యూటర్లు వాడుతూ తక్కువ ర్యామ్ ఉన్న వారికి ఈ కొత్త ఫెర్మార్‌మెన్స్ ట్యాబ్ ఉపయోగపడుతుందని ఫైర్‌ఫాక్స్ చెబుతోంది. ఇది ఆరంభం మాత్రమేనని ఇలాంటి మరిన్ని మార్పులు త్వరలోనే తీసుకొస్తామని ఆ సంస్థ వెల్లడించింది.
వెబ్ పేజీలు పరుగెత్తుతాయ్
మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో నెట్ నుంచి ఓపెన్ చేయాలంటే ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లు. మనకు విసుగు తెప్పించేలా ఒక చక్రం తిరుగుతూ నెమ్మదిగా ట్యాబ్‌లు ఓపెన్ అయ్యేవి. దీనికి కారణం తక్కువ ర్యామ్ ఉండడం. వేగం లేకపోవడంతో ఒకప్పుడు ఇంటర్నెట్ వినియోగదారులు చాలా విసుగు చెందేవాళ్లు. అలాంటి వారికి క్రోమ్ ఒక వరంలా దొరికింది. వెబ్ పేజీలు వేగంగా ఓపెన్ కావడం క్రోమ్ బ్రౌజర్‌లో చాలా సులభమైంది. ఈ నేపథ్యంలో క్రోమ్ మాదిరిగానే ఫైర్‌ఫాక్స్‌లోనూ వెబ్ బ్రౌజింగ్ వేగతరం చేయడానికి మొజిల్లా తీవ్రంగా కృషి చేస్తోంది. తాజాగా ప్రవేశపెడుతున్న ఫెర్మార్‌మెన్స్ ఫీచర్ కచ్చితంగా ఫైర్‌ఫాక్స్ వాడుతున్న వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందట. ఫెర్మార్‌మెన్స్ ఆప్షన్‌లో ఉండే ఆప్టిమైజ్ ఫైర్‌ఫాక్స్ కొన్ని యాడ్ ఆన్స్‌ని అడ్డుకుని బ్రౌజింగ్ వేగంగా జరిగేందుకు సహకరిస్తుంది.
ర్యామ్‌ని తీనేయకుండా..
సాధారణంగా యాడ్ ఆన్ ఆప్షన్లు మనకు తెలియకుండానే బ్యాక్ గ్రౌండ్‌లో ర్యామ్‌ని మింగేస్తూ ఉంటాయి. అందుకే యాడ్ ఆన్‌లను అవనసరమైన సందర్భాల్లో అడ్డుకోవడం మంచింది. ఫెర్మార్‌మెన్స్ ఆప్షన్ చేసేది ఇదే పని. అనవసమైన కంటెంట్ ఓపెన్ కాకుండా అడ్డుపడి మనం టైప్ చేసిన కంటెంట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. దీని వల్ల వేగంగా బ్రౌజింగ్ జరిగే అవకాశం ఉంది.