కంప్యూటర్ల ప్రాసెసర్లలో కొత్త పోటీకి ఇంటెల్, ఏఎండీ తెర తీశాయి. Intel Core i9 పేరుతో కొత్త ప్రాసెసర్‌ను లాంచ్ చేసింది. ఇప్పటివరకు ఉన్న కన్స్యూమర్ డెస్క్‌టాప్ ప్రాసెసర్లలో ఇదే ఫాస్టెస్ట్. Intel Core i9 ప్రాసెసర్ 10- కోర్ లతో ప్రారంభవమవుతుంది. ఈ మోడల్ (Core i9-7900X) సీపీయూ 999 డాలర్లు (అంటే దాదాపు 65వేల రూపాయలు) ఉంటుంది. స్పీడ్‌తోపాటు Core i9 సిరీస్‌లో చిన్న చిన్న మార్పులు కూడా ఉన్నాయి. కొత్త టర్బో బూస్ట్‌ను దీనిలో ఇంట్రడ్యూసఖ్ చేశారు. నాలుగు ఛానల్స్ డీడీఆర్4 ర్యామ్‌ను, ఇంటెల్ ఆప్టేన్ మెమరీని సపోర్ట్ చేసేలా తీర్చిదిద్దారు. Core i9తోపాటు స్కైలేక్ ఎక్స్ సిరీస్‌లో భాగంగా Core i5, Core i7 ప్రాసెసర్లను కూడా ఇంటెల్ లాంచ్ చేసింది. అయతే ఇవన్నీ కొత్త ఎక్స్ 299 చిప్‌సెట్ పైన మాత్రమే పని చేస్తాయి. కాబట్టి ఈ మూడు ప్రాసెసర్లలో ఏది వాడాలన్నా కొత్త మదర్‌బోర్డు తీసుకోవాల్సిందే. ఇంతకీ ఈ మూడు ప్రాసెసర్లలో ఎవరికి ఏది సూటబుల్ అనేది తెలుసుకోవాలంటే ఇది చదవండి.
ఆఫీస్‌కు వెళ్లేవారికి (The Office Goer)
బేసిక్ యాక్టివిటీస్ చేయడానికి అవసరమైన సింపుల్ లాప్‌ట్యాప్ చాలనుకంటే పాత ఇంటెల్ Core i3 ప్రాసెసర్ మీకు సరిపోతుంది. వెబ్‌బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, ఎంఎస్ ఆఫీస్‌తో పాటు సినిమాలు చూడడానికి కూడా ఈ ప్రాసెసర్ చాలు. Intel Core i3 7100 బెస్ట్ ఆప్షన్. కాస్ట్ కూడా తక్కువ. అయితే దీనిలో ఆన్‌బోర్డ్‌గా ఉండే గ్రాఫిక్స్ చిప్‌కు లిమిటేషన్స్ ఉన్నాయి. హెచ్‌డీ 5300 గ్రాఫిక్స్ కార్డ్ వేసుకుంటే వీటిని అధిగమించవచ్చు.
స్టూడెంట్స్ కి
మూవీస్ చూడడం, మ్యూజిక్ వినడం, సోషల్ నెట్‌వర్కింగ్, వెబ్‌బ్రౌజింగ్, ఎంఎస్ ఆఫీస్, కొద్దిగా గేమింగ్‌తోపాటు కోర్స్‌కు తగ్గ సాఫ్ట్‌వేర్‌లు వాడుకోవడానికి స్టూడెంట్లకు Intel Core M లేదా Intel Core i5 ప్రాసెసర్ ఉండాలి. మీకు గేమింగ్ అవసరం లేదు.. పొద్దల్లా క్యాంపస్‌లో కోర్స్‌తోనే సరిపోతుంది అనుకుంటే Intel Core M చాలు. ఇది మీ ల్యాపీకి లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. అదే డెస్క్‌టాప్ అయితే Core i5 quad-core processor తీసుకోవాలి. Core i5 7500 పీసీలకు బాగా పాపులరయిన ప్రాసెసర్ మోడల్.
గేమింగ్ లవర్స్‌కి..
కొత్తగా వచ్చిన ప్రతి గేమ్‌ను ఫ్రేమ్ రేట్స్‌లో ఎలాంటి డ్రాప్స్ లేకుండా ఆడాలనుకునే గేమింగ్ లవర్స్‌కు స్కైలేక్ ఎక్స్ సిరీస్లో వచ్చే ప్రాసెసర్లు ఉండాలి. క్వాడ్‌కోర్ ప్రాసెసర్ అయిన Intel Core i5-7640x తీసుకుంటే 16వేల రూపాయలకు దొరుకుతుంది. మరింత సూపర్ పెర్‌ఫార్మెన్స్ కావాలనుకుంటే Intel Core i7-7800x ప్రాసెసర్ బెటర్.
ప్రొఫెషనల్స్‌కి..
కోడింగ్, వీడియో ఎడిటింగ్, 3డీ మోడలింగ్ వంటివి రెగ్యులర్‌గా చేసే గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్స్, కోడర్స్, ఆర్కిటెక్స్ట్‌కు Intel Core i7-7820x ప్రాసెసర్ ఉండాల్సిందే. దీని ధర 43వేల వరకు ఉంటుంది.
బెస్ట్ ఆఫ్ ది బెస్ట్‌గా ఉండాలనుకునేవారికి..
సిస్టం స్పీడ్, ప్రాసెసర్ పెర్‌ఫార్మెన్స్.. ఇలా అన్నింటిలో బెస్ట్ ఆప్ ది బెస్ట్‌గా ఉండాలంటే మాత్రం Intel Core i9-7900x సిరీస్ ప్రాసెసర్ తీసుకోవాలి. లేటెస్ట్, గ్రేటెస్ట్ ఫీచర్లన్నింటతో వచ్చే ఈ ప్రాసెసర్ కాస్ట్ 80 వేల వరకు ఉంటుంది.