• తాజా వార్తలు

9.5 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌ తో ఎంఐ ల్యాప్ టాప్


స్మార్టు ఫోన్ల విక్రయాల్లో నిత్యం రికార్డులు బద్దలు కొడుతున్న షియోమీ సంస్థ త‌న 'ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 13.3' ల్యాప్‌టాప్‌కు కొత్త వేరియెంట్‌ను తాజాగా విడుద‌ల చేసింది. 8జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో విడుద‌లైన ఈ ల్యాప్‌టాప్ ధర స్టోరేజిని బట్టి వ‌రుస‌గా రూ.47,380, రూ.52,130 ఉంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఇది కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది.
ముఖ్యంగా ఇందులో లేటెస్ట్ ఇంటెల్ చిప్ వినియోగించారు. 4జీ మోడెమ్ తో అప్ డేట్ చేశారు. ఇందులో వాడిన ఇంటెల్ క్యాబీ లేక్ సెవన్త జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ వల్ల పాత వేరియంట్ కంటే అదనంగా 12 శాతం మంచి పెర్ఫార్మెన్సు ఇస్తున్నట్లు షియోమీ చెప్తోంది. 9 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ చార్జింగ్ వంటివి అదనపు ఆకర్షణలు. అయితే.... వీఓఎల్టీఈ సదుపాయం ఇందులో లేదు.
ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 13.3 స్పెసిఫికేష్లు ఇవీ..
13.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
ఇంటెల్ కోర్ ఐ5/ఐ7 ప్రాసెస‌ర్‌
8 జీబీ ర్యామ్‌
128/256 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌
2 జీబీ గ్రాఫిక్ కార్డ్‌
విండోస్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌
హెచ్‌డీ వెబ్ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌
డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 4.1
హెచ్‌డీఎంఐ
యూఎస్‌బీ టైప్ సి
డాల్బీ ఆడియో
9.5 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌
ఫాస్ట్ చార్జింగ్‌.

జన రంజకమైన వార్తలు