• తాజా వార్తలు

తొలి ఫాస్టెస్ట్ ఎల్‌టీఈ ఎనేబుల్డ్ ల్యాపీ.. మైక్రోసాఫ్ట్ స‌ర్ఫేస్ ప్రో

ఎల్‌టీఈ టెక్నాల‌జీ.. టెక్నాల‌జీ ఫీల్డ్‌లో చొచ్చుకుపోతోంది.  ఎల్‌టీఈ క‌నెక్టివిటీతో తొలి ల్యాప్‌టాప్‌ను మైక్రోసాఫ్ట్ తీసుకొస్తోంది. తొలి ఫాస్టెస్ట్ ఎల్‌టీఈ ఎనేబుల్డ్ ల్యాపీ మైక్రోసాఫ్ట్ స‌ర్ఫేస్ ప్రో ఈ ఏడాది డిసెంబ‌రు నెల నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వ‌స్తుంద‌ని  కంపెనీ ప్ర‌క‌టించింది.
ఎక్క‌డుంటే అక్క‌డే ఆఫీస్‌
 గ్లోబ‌ల్ క‌నెక్టివిటీ ఫీచ‌ర్‌తో వ‌చ్చే ఈ ల్యాపీ 20 సెల్యుల‌ర్ బ్రాండ్స్ ను స‌పోర్ట్ చేస్తుంది. అందుకే ఈ ల్యాపీతో మీరు ఆఫీస్‌లో ఉండాల్సిన ప‌ని లేదు. మీరు ఎక్క‌డుంటే అక్క‌డే ఆఫీస్‌గా మార్చుకోవ‌చ్చ‌ని మైక్రోసాఫ్ట్ చెబుతోంది.
 ఇవీ ఫీచ‌ర్లు
>  12.3 ఇంచెస్ పిక్సెల్ సెన్స్ డిస్‌ప్లే, 165 డిగ్రీస్ హింగ్‌
>  విండోస్ 19 ప్రో ఓఎస్‌తో ర‌న్ అవుతుంది. నెక్స్ట్ జ‌న‌రేష‌న్ స‌ర్ఫేస్ పెన్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
>   LTE Cat స‌పోర్ట్
>  9 డౌన్‌లోడింగ్ స్పీడ్
>  450 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్
>  ఎల్‌టీఈ టెక్నాల‌జీ కావ‌డంతో బ్యాట‌రీ స్పీడ్ కూడా బాగుంటుంది. 17 గంట‌ల వీడియో ప్లే బ్యాక్ టైం వ‌స్తుంద‌ని కంపెనీ క్లెయిం చేస్తోంది.
ప్రైస్
> ఎల్‌టీఈ అడ్వాన్స్‌డ్ మైక్రోసాఫ్ట్ స‌ర్ఫేస్ ప్రో ధ‌ర కూడా అందుబాటులోనే ఉంద‌ని కంపెనీ చెబుతోంది. 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజీతో వ‌చ్చే ఇంటెల్ కోర్ ఐ5 వెర్ష‌న్ ఖ‌రీదు 75,000.  16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజీతో వ‌చ్చే ఇంటెల్ కోర్ ఐ7 వెర్ష‌న్ ఖ‌రీదు 94వేల రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుంది.  విండోస్ 10 ప్రో ఓఎస్ 30 రోజుల అఫీషియ‌ల్ ట్ర‌య‌ల్ ఇస్తోంది.

జన రంజకమైన వార్తలు