ఎడ్యుకేషన్ ఫోకస్డ్ విండోస్ 10 ఎస్ సాఫ్ట్‌వేర్‌తో రన్ అయ్యే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. 14.5 గంటలు వచ్చే బ్యాటరీ దీనికి అతిపెద్ద ఎట్రాక్షన్ అని, మ్యాక్‌బుక్ ఎయిర్ కన్నా ఇదే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తోందని కంపెనీ చెబుతోంది. పోర్టబుల్‌గా, లైట్‌వెయిట్‌తో ఉండే ఈ ల్యాపీ స్లీక్ లుక్‌తో ప్రీమియం ఫినిష్‌తో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్ లైటింగ్‌తో వచ్చే ఆల్కంట్రా ఫ్యాబ్రిక్ కీ బోర్డ్ అమర్చారు. అతిపలచని టచ్‌స్క్రీన్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉన్న ల్యాప్‌టాప్ ఇదేనని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. ఈ ల్యాపీ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ప్రస్తుతం ఉన్న కోర్ ఐ7 బేస్ట్ మేక్ ప్రో కన్నా ఇది ఫాస్టెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇస్తుందని మైక్రోసాఫ్ట్ అంటోంది.
కాన్ఫిగరేషన్
* 13.5 ఇంచ్ పిక్సెల్ సెన్స్ టచ్‌స్క్రీన్ విచ్ 1080పీ రిజల్యూషన్
* డివైస్ మందం 9.9 మి.మీ. నుంచి 14.7.మి.మీ. , బరువు 1.25 కేజీలు
* 4జీబీ ర్యామ్
* 128 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజీ
* ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ ఆప్షన్ తీసుకుంటే ర్యామ్, స్టోరేజీ కన్ఫిగరేషన్లు మారతాయి
* 14.5 గంటలపాటు వచ్చే బ్యాటరీ
* యూఎస్‌బీ పోర్ట్, మినీ డిస్ ప్లే బోర్డ్
* సర్ఫేస్ పవర్ కనెక్టర్
* ఎస్డీ కార్డ్ స్లాట్
* 3.5 ఎంఎం ఆడియో జాక్
ప్రీఆర్డర్ చేయొచ్చు
బర్గండీ, గ్రాఫైట్ గోల్డ్, ప్లాటినం, కోబాల్ట్ బ్లూ కలర్స్‌లో దొరుకుతుంది. ప్రీ ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు. 999 డాలర్లు (సుమారు 67వేల రూపాయలు) ధర పలికే ఈ ల్యాప్‌టాప్‌ను ప్రీ ఆర్డర్ చేస్తే జూన్ 15 నుంచి షిప్పింగ్స్ ప్రారంభిస్తుంది. విండోస్ 10 ఎస్ ఓఎస్ కావడం వల్ల విండోస్ స్టోర్‌లోని యాప్‌లు మాత్రమే రన్ అవుతాయి. బయటి యాప్‌లు వాడుకోవాలంటే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్టతో భాగస్వామ్యం కలిగిన ఏసర్, ఏసెస్, హెచ్‌పీ, శ్యాంసంగ్, తోషిబా వంటివి విండోస్ 10 ఎడ్యుకేషన్ సాఫ్ట్‌వేర్ ఉన్న పీసీలను 12 వేల ధర నుంచే అందిస్తున్నాయి. అయితే ఇది ల్యాపీ కావడం, ప్రధానంగా క్రోమ్‌బుక్‌తో పోటీకి రావడం గుర్తించాల్సిన అంశం.