• తాజా వార్తలు

డెల్ ఇండియా నుంచి సరికొత్త  ల్యాపీ, ధర రూ. లక్షా 35వేలు

ల్యాప్‌టాప్ తయారీ దిగ్గజం డెల్‌ ఇండియా సరికొత్త  ల్యాప్‌టాప్‌ను రిలీజ్‌ చేసింది.  వైర్‌లెస్ చార్జింగ్ ల్యాపీ లాటిట్యూడ్‌ 7000  సిరీస్‌లో భాగంగా లాటిట్యూడ్‌ 7400ను విడుదల చేసింది.  ఇది 14 అంగుళాల 2 ఇన్‌ వన్‌  ల్యాప్‌టాప్‌.దీని ప్రారంభ ధర రూ. 1,35,000 గా  నిర్ణయించింది.  స్పెషల్ ఫీచర్ గా ఇంటెల్‌ కంటెక్ట్స్‌ టెక్నాలజీ ఆధారిత సెన్సర్‌ను  ఇందులో జోడించింది. ఎక్స్‌ప్రెస్‌ చార్జింగ్‌, ఎక్స్‌ప్రెస్‌ కనెక్ట్‌లాంటి ఫీచర్లతో యూజర్లకు బెస్ట్‌ అనుభవాన్ని ఇస్తుందనీ, ఎలాంటి అంతరాయం లేకుండా వేగవంతమైన, సర్వీసులను అందిస్తుందని  డెల్‌  ప్రకటించింది.  ఈ డివైస్ వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో ఒక గంటలో 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ చేయవచ్చు.

మెటల్ చట్రం వైర్లెస్ పనితీరును అడ్డుకోలేని విధంగా డివైస్ యాంటెనా రూపకల్పనపై దృష్టి సారించింది.ఈ ల్యాప్ టాప్ వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో ఒక గంటలో 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ చేయవచ్చు.థర్మల్ పెర్ఫార్మన్స్ కోసం లాటిట్యూడ్ 7400 2-ఇన్ -1 GORE మెటీరియల్ airgel ద్వారా నింపబడి ఉంటుంది.ఇది ముందు దాని స్టార్డస్ట్ దర్యాప్తుపై NASA చేత ఉపయోగించబడింది.

కాన్ఫిగరేషన్ కొరకు లాటిట్యూడ్ 7400 2-ఇన్ -1 యొక్క ఫీచర్స్ ఇంటెల్ యొక్క 8 వ తరం క్వాడ్-కోర్ CPU, కోర్-i7 మరియు 16GB RAMలు కలిగి ఉంటాయి. నోట్ బుక్ 1TB m.2 NVMe స్టోరేజ్ మరియు WiFi 6 మద్దతుతో పాటు Cat16 గిగాబిట్ LTE తో కాన్ఫిగర్ చేయబడుతుంది. ఇతర లక్షణాలు 78WHr బ్యాటరీ, రెండు USB 3.1 Gen 1 పోర్టులు, రెండు థండర్ బోట్ 3 పోర్ట్లు, ఒక HDMI 1.4 పోర్ట్, డ్యూయల్ 2x2 MIMO యాంటెనాలు మరియు Bluetooth 5.0 తో-బ్యాండ్ 802.11ac Wi-Fi.

స్లీప్‌మోడ్‌లో ఉన్న ల్యాప్‌టాప్‌ యూజర్‌ ఉనికిని గుర్తించి  విండోస్‌ హలో  (బయోమెట్రిక్‌ యాక్సెస్‌) కు లాగిన్‌ అవుతుంది. లేదంటే ఆటోమేటిక్‌గా లాక్‌ అవుతుంది. తద్వారా సెక్యూరిటీతో బ్యాటరీ  పొదుపు అవుతుందని కంపెనీ చెబుతోంది. ఫింగర్‌ ప్రింట్ రీడర్‌, పవర్‌ బటన్‌ లాంటి ఇ‍న్నోవేటివ్‌ ఫీచర్లతో వ్యాపార సంస్థలకు  చాలా ఉపయోగకరంగా ఉంటుందని డెల్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ ఇంద్రజిత్‌ బెలగుండి చెప్పారు. అయితే ఆసక్తి ఉన్న సాధారణ వినియోగదారులు కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చని తెలిపారు. తొందరలోనే ఆన్‌లైన్‌, రీటైల్‌ స్టోర్లలో ఈ ల్యాప్‌టాప్‌లనుఅందుబాటులోకి తెస్తామని చెప్పారు.

ఇదిలా ఉంటే భారతీయ అత్యంత విశ్వసనీయ బ్రాండ్ల జాబితాలో ప్రముఖ ల్యాప్ టాప్ బ్రాండ్ డెల్ తొలి స్థానంలో ఉన్నట్లు టీఆర్ ఎ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ బ్రాండ్ ట్రప్ట్ రిపోర్ట్ 2019 పేరిట విడుదల చేసిన తాజా నివేదికలో ఆటోమొబైల్ కంపెనీ జీప్ అత్యంత  విశ్వసనీయ బ్రాండ్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. 

జన రంజకమైన వార్తలు