ల్యాప్ టాప్ ల తయారీలో పేరుగాంచిన హెచ్ పీ సంస్థ మరో రెండు కొత్త ల్యాపీలను మార్కెట్ కు పరిచయం చేస్తోంది. 'పెవిలియన్ ఎక్స్360, స్పెక్టర్ ఎక్స్360' పేరిట హెచ్‌పీ సంస్థ వీటిని విడుదల చేసింది. ఇందులో ఒకటి ఏకంగా 16 జీబీ ర్యామ్ తో రావడం విశేషం.
ధర మాటేంటి..?
11.6, 14 ఇంచ్ వేరియెంట్లలో హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్360 ల్యాప్‌టాప్ రూ.40,290, రూ.55,290 ధరలకు లభిస్తుంది. అలాగే హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 13.3 ఇంచ్ సైజ్ నుంచి లభ్యమవుతున్నది. దీని ధర రూ.1,15,290.
ఇంతకీ వీటిలో ఏమున్నాయి..?
హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్360 ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ 7వ జనరేషన్ ప్రాసెసర్, 2 జీబీ గ్రాఫిక్స్ మెమోరీ, 1 టీబీ హార్డ్ డిస్క్, 8 జీబీ ర్యామ్, 10 గంటల బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ చార్జ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ 7వ జనరేషన్ ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీ, 12 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.