దిగ్గజ సంస్థ లెనోవో చవక ధరకే పలు నూతన ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నది. ఐడియాప్యాడ్ ఎస్145, ఎస్340, ఎస్540 మోడల్స్‌లో లెనోవో తన నూతన ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. లెనోవో ఐడియాప్యాడ్ ఎస్145 ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.23,990 ఉంది. అలాగే ఐడియాప్యాడ్ ఎస్340 ప్రారంభ ధర రూ.36,990గా ఉంది. మరో ఐడియాప్యాడ్ ఎస్540 ప్రారంభ ధర రూ.64,990గా ఉంది. వీటిని కొనుగోలు చేయాలనుకునే యూజర్లు లెనోవో స్టోర్స్‌తో పాటు పలు ఇతర ఎలక్ట్రానిక్స్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.
లెనోవో ఐడియాప్యాడ్ ఎస్145 ఫీచర్లు
15.6 ఇంచ్ డిస్‌ప్లే, 8వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7/ఇంటెల్ పెంటియం/ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఎన్‌వీడియా గ్రాఫిక్స్, 12జీబీ వరకు ర్యామ్‌కు సపోర్ట్, 128 జీబీ ఎస్‌ఎస్‌డీ, 1 టీబీ హార్డ్ డిస్క్‌డ్రైవ్, డాల్బీ ఆడియో స్పీకర్లు, విండోస్ 10 హోం ఓఎస్, బ్లూటూత్ 4.1, హెచ్‌డీఎంఐ, కార్డ్ రీడర్, 6.5 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
లెనోవో ఐడియాప్యాడ్ ఎస్340 ఫీచర్లు
ఇంటెల్ 8వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్, 12 జీబీ వరకు ర్యామ్‌కు సపోర్ట్, 14 లేదా 15 ఇంచుల డిస్‌ప్లే ఆప్షన్లు తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
ఐడియా ప్యాడ్ ఎస్540 ఫీచర్లు
ఇంటెల్ 8వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఎన్‌వీడియా జిఫోర్స్ ఎంఎక్స్250 గ్రాఫిక్ కార్డ్ లేదా ఏఎండీ రైజెన్ 7 3700యు ప్రాసెసర్, రేడియాన్ ఆర్‌ఎక్స్ వెగా 10 గ్రాఫిక్ కార్డ్, 12 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్, 14 లేదా 15 ఇంచుల డిస్‌ప్లే ఆప్షన్లు, 12 జీబీ వరకు ర్యామ్‌కు సపోర్ట్, 512 జీబీ వరకు ఎస్‌ఎస్‌డీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.