టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా టెక్ కంపెనీ లెనోవో ప్రోటోటైప్ ఫోల్డబుల్ ల్యాపీని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ పీసీ అని లెనోవో ఒక ప్రకటనలో తెలిపింది. ల్యాప్‌టాప్ ఆకారంలో మడవటానికి వీలుగా ఫోల్డబుల్ స్క్రీన్‌తో ఫుల్ ప్లెడ్జ్‌డ్ ల్యాప్‌టాప్ గా ఇది వినియోగదారులను అలరించనుంది. ‘థింక్ ఫ్యాడ్ ఎక్స్1’ అని పేరుతో వచ్చిన ఈ ల్యాపీ ఫీచర్ల విషయానికొస్తే..13.3 అంగుళాల పరిమాణం, 9.3 ఇంచీల స్క్రీన్, ఇంటెల్ ప్రాసెసర్, యూఎస్‌బీ పోర్ట్స్, ఇన్‌ఫ్రార్డ్ కెమెరా, స్టీరియో స్పీకర్స్, హై-రిజల్యూషన్ డిస్ ప్లే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రధాఫీచర్లుగా ఉన్నాయి. 2020 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. ధర వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించిపోయినప్పటికీ, మూడు నుంచి 4వేల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా మార్కెట్లో రూ. 25 వేలల్లో ఇప్పుడు లభిస్తున్న బెస్ట్ ల్యాపీలపై ఓ లుక్కేద్దాం.
హెచ్‌పి 15 ఏపీయూ డ్యుయల్ కోర్ ఏ9 (HP 15 APU Dual Core A9)
ధర రూ.24,490
స్పెసిఫికేషన్స్... 15.6 ఇంచ్ స్ర్కీన్, ఏఎమ్‌డి రాడియోన్ 520 2జీబి గ్రాఫిక్స్, 3గిగాహెట్జ్ ఏఎమ్‌డి డ్యయల్ కోర్ ఏ9-9420 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్4 ర్యామ్, 1టీబీ 5400rpm సీరియన్ ఏటీఏ హార్డ్ డ్రైవ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 4 గంటల బ్యాటరీ లైఫ్.
ఏసర్ ఆస్పైర్ 3 సెలిరాన్ డ్యుయల్ కోర్ (Acer Aspire 3 Celeron Dual Core)
ధర రూ.20,500
కీలక స్పెసిఫికేషన్స్... 15.6 ఇంచ్ స్ర్కీన్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్, 1.1గిగాహెట్జ్ ఇంటెల్ సెలిరాన్ 3350 ప్రాసెసర్, 2జీబి డీడీఆర్4 ర్యామ్, 500జీబి ఇసాటా హార్డ్‌డ్రైవ్.
లెనోవో ఐడియాప్యాడ్ 330 ప్రీమియమ్ క్వాడ్ కోర్ (Lenovo Ideapad 330 Pentium Quad Core)
ధర రూ.19,990
స్పెసిఫికేషన్స్.. ఇంటెల్ పెంటియమ్ క్వాడ్ కోర్ ఎన్5000 సీపీయూ, 4జీబి డీడీఆర్3 ర్యామ్, 1టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, విండోస్ 10 హోమ్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్.
ఆసుస్ ఏపీయూ క్వాడ్ కోర్ ఇ2 (Asus APU Quad Core E2)
ధర రూ.17,990.
స్పెసిఫికేషన్స్
15.6 ఇంచ్ హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్ లైట్ యాంటీగ్లేర్ డిస్ ప్లే, 4జీబి ర్యామ్, 500జీబి హార్డ్ డిస్క్ డరైవ్, విండోస్ 10 హోమ్, 3 సెల్ బ్యాటరీ (45 వాట్ ఏసీ అడాప్టర్)
హెచ్‌పి ఇంప్రింట్ పెంటియమ్ క్వాడ్ కోర్ (HP Imprint Pentium Quad Core)
ధర రూ.23,490
స్పెసిఫికేషన్స్
15.6 ఇంచ్ స్ర్కీన్, DOS ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ హైడెఫినిషన్ 405 గ్రాఫిక్స్, 1.6గిగాహెట్జ్ ఇంటల్ పెంటియమ్ ఎన్3710 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్3 ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్.
ఏసర్ ఆస్పైర్ 3 ఏపీయూ డ్యుయల్ కోర్ ఇ2 (Acer Aspire 3 APU Dual Core E2)
ధర రూ.20,990
స్పెసఫికేషన్స్
15.6 ఇంచ్ స్ర్కీన్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ గ్రాఫిక్స్ 1.8గిగాహెట్జ్ ఇంటెల్ ఏఎమ్‌డి ఇ2-9000 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్3 ర్యామ్, 1టీబీ హార్డ్‌డ్రైవ్.
లెనోవో ఐడియాప్యాడ్ 320 ఏపీయూ క్వాడ్ కోర్ ఏ6 (Lenovo Ideapad 320 APU Quad Core A6)
ధర రూ.20,990
స్పెసిఫికేషన్స్
15.6 ఇంచ్ హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్ లైట్ యాంటీ గ్లేర్ టీఎన్ డిస్ ప్లే, 4జీబి ర్యామ్, కోర్ ఐ3 ప్రాసెసర్, 1టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, DOS ఆపరేటింగ్ సిస్టం, 45 వాట్ బ్యాటరీ.
డెల్ 3000 ఏపీయూ క్వాడ్ కోర్ ఇ2 6వ తరం (Dell 3000 APU Quad Core E2)
ధర రూ.24,000
స్పెసిఫికేషన్స్
15.6 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1366x768 పిక్సల్స్), విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, 1టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, లిథియమ్ బ్యాటరీ.