దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ ఆకట్టుకునే ఫీచర్లతో రెండు ల్యాపీలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం వీటిని అమెరికా మార్కెట్లో విడుదల చేశారు. నోట్‌బుక్ 7, నోట్‌బుక్ 7 ఫోర్స్ పేరిట రెండు నూతన ల్యాప్‌టాప్‌లను శాంసంగ్ కంపెనీ అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. హై ఎండ్ ప్రీమయం ధరలో ఇవి అందుబాటులో ఉన్నాయి. కాగా ఇండియాకు ఈ ల్యాపీలు అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
నోట్‌బుక్ 7 ల్యాప్‌టాప్‌లో 13.3/15.6 ఇంచ్ డిస్‌ప్లే, విండోస్ 10 హోం, ఇంటెల్ 8వ జనరేషన్ కోర్ ప్రాసెసర్, ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్/ఎన్‌వీడియా జిఫోర్స్ ఎంఎక్స్ 250 గ్రాఫిక్స్ కార్డ్, 16జీబీ వరకు ర్యామ్ సపోర్ట్, 256/512 జీబీ ఎస్‌ఎస్‌డీ, 720పి హెచ్‌డీ వెబ్ కెమెరా, డాల్బీ అట్మోస్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 55వాట్‌అవర్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
శాంసంగ్ నోట్‌బుక్ 7 ఫోర్స్ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచుల డిస్‌ప్లే, విండోస్ 10 హోం, ఇంటెల్ 8వ జనరేషన్ కోర్ ప్రాసెసర్, ఎన్‌వీడియా జిఫోర్స్ జీటీఎక్స్ 1650 గ్రాఫిక్స్ కార్డ్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీ, 720పి హెచ్‌డీ వెబ్ కెమెరా, డాల్బీ అట్మోస్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 43 వాట్‌అవర్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
నోట్‌బుక్ 7 ల్యాప్‌టాప్ రూ.69,285 ప్రారంభ ధరకు లభ్యం కానుండగా, నోట్‌బుక్ 7 ఫోర్స్ ల్యాప్‌టాప్ రూ.1,03,930 ధరకు లభ్యం కానుంది. జూలై 12వ తేదీ నుంచి ఈ రెండు ల్యాప్‌టాప్‌లను విక్రయించనున్నారు.