తైవాన్ కు చెందిన ప్రముఖ ల్యాప్ టాప్ ల తయారీ సంస్థ ఆసుస్ ఒకేసారి మూడు ల్యాప్ టాప్ లను మార్కెట్లోకి రిలీజ్ చేసి దుమ్ము రేపింది. ఒక్కోటి ఒక్కో స్పెషలైజేషన్ తో తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
ఇందులో భాగంగా ప్రపంచంలో అత్యంత స్లిమ్ ల్యాపీని రిలీజ్ చేసింది. 'జెన్‌బుక్ ఫ్లిఫ్ ఎస్' పేరిట విడుదల చేసిన దీని థిక్ నెస్ కేవలం 10.9 ఎంఎం మాత్రమే. అంతేకాదు దీని బరువు కూడా తక్కువే. కేవలం 1.1 కేజీల బరువును మాత్రమే ఇది కలిగి ఉంది. కంప్యూటెక్స్ 2017 సదస్సులో అసుస్ ఈ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.70వేలు.
49 నిమిషాల్లోనే 60 శాతం ఛార్జింగ్
ఒక సారి ఫుల్ చార్జింగ్ చేస్తే ఈ ల్యాప్‌టాప్‌ను 11 గంటల వరకు వాడుకోవచ్చు. కేవలం 49 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే 60 శాతం వరకు పూర్తవుతుంది. ఈ ల్యాప్‌టాప్ డిస్‌ప్లేను 360 డిగ్రీల కోణంలో ఎటు పడితే అటు తిప్పుకోవచ్చు. ట్యాబ్‌గా కూడా దీన్ని వాడుకోవచ్చు.
జెన్‌బుక్ ఫ్లిఫ్ ఎస్ స్పెక్స్
* అసుస్ జెన్‌బుక్ ఫ్లిప్ ఎస్ ల్యాప్‌టాప్‌లో 13 ఇంచ్ 4కె అల్ట్రాహెచ్‌డీ డిస్‌ప్లే ఉంది.
* కోర్ ఐ5/ఐ7 ప్రాసెసర్
* 16 జీబీ ర్యామ్
* 1 టీబీ సాలిడ్ స్టేట్ డ్రైవ్
* విండోస్ 10 ఓఎస్
14 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో అసుస్ జెన్‌బుక్ ప్రొ యూఎక్స్550
అసుస్ తన నూతన ల్యాప్‌టాప్ 'జెన్‌బుక్ ప్రొ యూఎక్స్550' ని విడుదల చేసింది. రూ.83వేలకు ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు లభిస్తోంది.
జెన్‌బుక్ ప్రొ యూఎక్స్550 స్పెసిఫికేషన్లు
* 15.6 ఇంచ్ 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే
* ఇంటెల్ కోర్ ఐ7 క్వాడ్‌కోర్ ప్రాసెసర్
* విండోస్ 10 ఓఎస్
* ఎన్‌వీడియా జిఫోర్స్ జీటీఎక్స్1050టిఐ గ్రాఫిక్స్
* 1 టీబీ హార్డ్ డిస్క్
* 16 జీబీ ర్యామ్
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* వన్ టచ్ లాగిన్
* యూఎస్‌బీ టైప్ సి
* మైక్రో ఎస్‌డీ కార్డ్ రీడర్
* 14 గంటల బ్యాటరీ బ్యాకప్
రూ.51 వేల ధరలో వివోబుక్ ప్రొ 15
ఆసుస్ 'వివోబుక్ ప్రొ 15' పేరిట మరో ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. రూ.51వేల ధరకు ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు లభిస్తోంది.
* 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
* ఇంటెల్ కోర్ ఐ3/ఐ5/ఐ7 ప్రాసెసర్ వేరియంట్లు
* 16 జీబీ ర్యామ్
* డ్యుయల్ బ్యాండ్ వైఫై
* 2 టీబీ హార్డ్ డిస్క్
* 512 జీబీ సాలిడ్ స్టేట్ డ్రైవ్
* విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్