• తాజా వార్తలు

26 కోట్ల ఫేస్‌బుక్ అకౌంట్లు డార్క్‌వెబ్‌లో అమ్మేశారు.. మీ అకౌంట్‌ను కాపాడుకోండి ఇలా..

ప్రపంచ‌వ్యాప్తంగా 26 కోట్ల‌కుపైగా ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌ను హ్యాక‌ర్లు డార్క్‌వెబ్‌లో అమ్మేశారని సైబ‌ర్ సెక్యూరిటీ రీసెర్చ‌ర్లు తాజాగా ప్ర‌కటించారు. సైబ‌ల్ అనే సైబ‌ర్ సెక్యూరిటీ కంపెనీ లెక్క‌ల ప్ర‌కారం ఈ అకౌంట్ల‌ను జ‌స్ట్ 42వేల రూపాయ‌ల‌కు అమ్మేశార‌ట‌. దీంతో ఫేస్‌బుక్ యూజర్లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆ కంపెనీ  హెచ్చ‌రించింది.

ఏమేం అమ్మారంటే..
26 కోట్ల ఫేస్‌బుక్ అకౌంట్ల‌కు సంబంధించిన ఈమెయిల్ అడ్ర‌స్‌లు, పేర్లు, ఫేస్‌బుక్ ఐడీలు, డేట్ ఆఫ్ బర్త్‌లు, ఫోన్ నెంబర్లు ఇలా అమ్మేశారు. అయితే ఆయా ఎఫ్‌బీ అకౌంట్ల పాస్‌వ‌ర్డ్‌ల‌ను మాత్రం హ్యాక‌ర్లు ఎక్స్‌పోజ్ చేయ‌క‌పోవ‌డం కాస్త‌లో కాస్త మేలు. అయితే ఫోన్ నెంబ‌ర్లు, మెయిల్ ఐడీలు, పుట్టిన‌రోజుల వంటి వివ‌రాలు వేరేవారికి చేరిపోవ‌డం మాత్రం ప్ర‌మాద‌క‌ర‌మే.

మీ అకౌంట్‌ను ఎలా కాపాడుకోవాలంటే?

మీ ఫేస్‌బుక్ అకౌంట్ వివ‌రాలు హ్యాక‌ర్లు కొట్టేయ‌కుండా ఉండాలంటే ఈ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.

* మీ ఫేస్‌బుక్ పాస్‌వ‌ర్డ్‌ను త‌ర‌చూ మార్చుకోండి.

*  మీ పుట్టిన‌రోజులు, కుటుంబ‌స‌భ్యుల పుట్టిన‌రోజులు, ఏజ్‌, వాళ్ల పేర్లు వ‌చ్చేలా పాస్‌వ‌ర్డ్‌లు పెట్టుకోకుండా ఉంటే మంచిది.

* మీ పాస్‌వ‌ర్డ్ సాధ్య‌మైనంత సంక్లిష్టంగా ఉండాలి. అంటే నంబ‌ర్లు, అక్ష‌రాలు, స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ల‌తో పాస్‌వ‌ర్డ్‌ను మిక్స్ చేసుకోండి.

* సెక్యూరిటీ బాగుండ‌టానికి ఫేస్‌బుక్ తీసుకొచ్చిన టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్‌ను క‌చ్చితంగా ఉప‌యోగించుకోండి.

 

జన రంజకమైన వార్తలు